గత నెల 11న ‘సాక్షి’ పత్రికను చదువుతున్న సీఎం చంద్రబాబు (ఫైల్)
సాక్షి, విశాఖపట్నం/బీచ్‌రోడ్ (విశాఖ తూర్పు): సాక్షి పత్రికను చదివితే చాలా ప్రమాదమని ముఖ్యమంత్రి తనయుడు, పంచాయతీ రాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆ పత్రికలో ఏవేవో రాస్తారని అది ప్రమాదమని చెప్పారు. శనివారం విశాఖలో టీడీపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు.
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై, ‘సాక్షి’పై విరుచుకుపడ్డారు. తాను మాత్రం పేపర్, చానల్‌ను పెట్టనని చెప్పారు. తన తాత, తండ్రిలా మంచి పేరు తెచ్చుకోలేకపోయినా, వారికి చెడ్డ పేరు మాత్రం తేబోనన్నారు. ప్రతిపక్ష నేతలు కుల, మతాలతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.