టీడీపీ నాయకుల దౌర్జన్యకాండ | Outraged TDP leaders | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకుల దౌర్జన్యకాండ

Published Sat, Nov 19 2016 1:05 AM | Last Updated on Mon, Aug 20 2018 8:31 PM

టీడీపీ నాయకుల దౌర్జన్యకాండ - Sakshi

టీడీపీ నాయకుల దౌర్జన్యకాండ

పుంగనూరు: బోయకొండలో టీడీపీ నాయకుడు, ఆయన అనుచరులు శుక్రవారం దౌర్జన్యానికి తెగబడ్డారు. తమ పార్టీకి చెందిన నియోజకవర్గ నాయకురాలు రతీదేవి, బీసీ సంఘ నేతలపైన, చిత్రీకరణకు వెళ్లిన సాక్షి టీవీ విలేకరిపైన వీరు దాడిచేశారు. దాడిలో గాయపడిన టీవీ విలేకరి చికిత్స పొందుతున్నారు. పుంగనూరులో శుక్రవారం సాయంత్రం జరిగిన సంఘటన వివరాలిలా.. గంగమ్మ ఆలయానికి గత పాలకమండలి చైర్మన్‌గా టీడీపీ నాయకురాలు రతీదేవి, ఆమె భర్త ఎస్‌కే.రమణారెడ్డి రెండు ప ర్యాయాలు పనిచేశారు. అరుుతే  చైర్మన్ పదవి తమ వర్గానికి ఇవ్వాలని బీసీ నేతలు గంగరాజు, కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఇటీవల పోరా టం చేశారు. ప్రభుత్వం చౌడేపల్లెకు చెందిన గువ్వల రామకృష్ణారెడ్డిని చైర్మన్‌గా నియమించింది.

దీనిపై బీసీ నేత గంగరాజు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ చైర్మన్ ఎస్‌కె.రమణారెడ్డి రిట్లు దాఖలు చేశారు. బోయకొండ అక్రమాలపై సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వాలని ఎస్‌కె.రమణారెడ్డి దరఖాస్తు కూడా చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కొత్తఇండ్లు వద్ద బీసీ నేతలు గంగరాజు, కృష్ణ్ణమూర్తిపై బోయకొండ చైర్మన్ కుమారుడు రమేష్‌రెడ్డి, 20 మంది అనుచరులు కలసి దాడి చేశారు. మాజీ చైర్మన్ రతీదేవి ఇంటికి వెళ్లి తలుపులు పగులగొట్టి ఇంటిలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. తనను  దుర్భాషలాడినట్లు బాధితురాలు పో లీసులకు ఫిర్యాదుచేశారు. ఈ దాడి సంఘటనను చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ విలేకరి వసంతకుమార్‌ను టీడీపీకి చెందినవారు దాడి చేసి గాయపరిచా రు. కెమెరా పగులగొట్టారు. చైను, డ బ్బులు లాక్కున్నారు. విలేకరి ప్రభు త్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా రు. ఎస్‌ఐ హరిప్రసాద్ సంఘటన స్థ లాన్ని సందర్శించారు. రతీదేవి, బీసీ సంఘ నాయకుల ఫిర్యాదు మేరకు 2 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement