మళ్లీ పప్పులో కాలేసిన మంత్రి లోకేశ్..
అమరావతి: ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే.. ప్రత్యర్థి పార్టీలపై, ఆయా నాయకులపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించిన ఘనత ప్రస్తుత ఏపీ మంత్రి నారా లోకేశ్ సొంతం. సొంత రాష్ట్ర నేతలపైనేకాదు, పొరుగు రాష్ట్రానికి చెందిన మంత్రులపై సైతం లోకేశ్ పేల్చిన ట్వీట్లు.. కొన్నిసార్లు వివాదాస్పదం కావడం, ‘ట్విట్టర్‌లో తప్ప బయటికొచ్చి మాట్లాడలేడు..’ లాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి రావడం తెలిసిందే.
హైటెక్ ముఖ్యమంత్రినని చెప్పుకునే చంద్రబాబుకు కొడుకుగా తొలినుంచీ సోషల్ మీడియాలో, మరీ ముఖ్యంగా ట్విట్టర్‌లో తనదైన శైలిలో దూసుకుపోతున్న లోకేశ్‌పై అదే స్థాయిలో విమర్శలు, జోకులు పేలుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ నెటిజన్లకు హాట్ టాపిక్‌గా మారింది.
(డెస్క్‌టాప్ నుంచి తీసిన స్క్రీన్ షాట్)
‘అమరావతిలో మండలి చైర్మన్ చక్రపాణి గారిని కలుసుకోవడం సంతోషంగా ఉంది..’ అంటూ గురువారం రాత్రి నారా లోకేశ్ తన అఫీషియల్ ట్విట్టర్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఆ స్టేటస్‌కు జత చేసిన ఫొటోలో అసలు చక్రపాణిగారు లేకపోవడంతో ట్విట్టరర్స్ అవాక్కయ్యారు. ఇప్పటికే మంత్రి హోదాలో బహిరంగ వేదికలపై మాట్లాడుతూ.. ‘అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు..’, ‘మంచి నీటి సమస్య కల్పన..’, ‘వచ్చే ఎన్నికల్లో 200 సీట్లు..’ లాంటి వ్యాఖ్యలు చేసిన నారా లోకేశ్‌పై సోషల్ మీడియాలో వ్యక్తమైన అభిప్రాయాలు అందరికీ తెలిసిందే. కాగా, కొద్దిసేపటికిగానీ సన్నిహితులు చెప్పడంతో తప్పు తెలుసుకున్న లోకేశ్.. పాత ట్వీట్‌ను తొలగించి సరైన ఫొటోతో మరో ట్వీట్ చేశారు.
కొసమెరుపు: మూడు రోజుల కిందట వెలగపూడి సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి లోకేశ్.. ప్రతిపక్షాలు తనను పప్పు అని ఒకసారి, అవినీతిపరుడని మరోసారి విమర్శిస్తున్నాయని, ఆ రెండింటిలో తాను ఏదో (పప్పా?, అవినీతిపరుడా?) తేల్చి చెప్పాలని అన్నారు. ఆయన పప్పా కాదా అన్నది కాసేపు పక్కన పెడితే.. తప్పులు మాత్రం విధిగా, విరివిగా చేస్తున్నారని చెప్పక తప్పదు!
చదవండి: నేను పప్పా.. అవినీతిపరుడినా!
నారా లోకేశ్ ప్రమాణం చూశారా?
మంత్రి లోకేశ్ మరోసారి అభాసుపాలు