అంబేడ్కర్ భారత జాతికి మార్గదర్శకుడు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ
న్యూఢిల్లీ: ఆధునిక భారత దేశానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ మార్గదర్శకుడని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అభివర్ణించారు. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆమె గురువారం మాట్లాడారు. దేశ ప్రగతికి బాబాసాహెబ్ కృషి చేశారని కొనియాడారు. గాంధీ, నెహ్రూ, పటేల్‌లతో స్వాతంత్య్ర సమరంలో అంబేడ్కర్ పాల్గొన్నారని సోనియా గుర్తుచేశారు.
అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అన్ని వర్గాల వారికి అధికారాన్ని కల్పిస్తూ సమానత్వం చూపిస్తోందని తెలిపారు. అందరికీ హక్కులు కల్పిస్తూ సామాజిక, ఆర్థిక అసమానతలకు తావులేకుండా అంబేడ్కర్ బాటలు వేశారని ఆమె కొనియాడారు.