
కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్డేడియంలో నవంబర్ 1 నుంచి 10వ తేదీవరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాటీ జరగనుంది. చెన్నైలోని హెడ్‌క్వార్టర్స్ రిక్రూటింగ్ జోన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాలకు (10 పాత జిల్లాల ప్రకారం) చెందిన 4,9078 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. గుంటూరులో జరిగిన ర్యాలీ నుంచి 5,895 మంది అభ్యర్థులతో పాటు మొత్తం 54,973 మంది అభ్యర్థులు ర్యాలీకి హాజరుకానున్నారు. కరీంనగర్ కేంద్రంలోని అంబేవడ్కర్ స్టేడియంలో నియామక ప్రక్రియ జరుగనుంది.
సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ క్లర్క్/ ఎస్కెటీ, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ర్యాలీకి వచ్చే అభ్యర్థుల కోసం జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయనుంది. ఆర్మీ రిక్రూట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ పవన్ పూరి సోమవారం ర్యాలీ ఏర్పాట్లను సమీక్షించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్ ర్యాలీ నియామకాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే నియామక ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment