
పథకాలు సమర్థవంతంగా అమలుచేయాలి
అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్
దిలావర్‌పూర్ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తోపాటు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు డి.జగన్మోహన్ డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన సంఘ సర్వసభ్య సమావేశానికి జగన్మోహన్ హాజరై మాట్లాడారు. అంబేద్కర్ ఆలోచనా విధానం, ఆశయాలు గ్రామ గ్రామానికి తీసుకెళ్తామన్నారు. ఈ సందర్భంగా దిలావర్‌పూర్ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా బొల్ల దయాకర్, ఉపాధ్యక్షుడిగా దండి రాజు, కార్యదర్శిగా రావుల రవి, సంయుక్త కార్యదర్శిగా సప్పల రవి, జి.మధుకర్, కోశాధికారిగా పోల లస్మన్న, ప్రచార కార్యదర్శిగా సప్పల మహేశ్, మద్ది మహిపాల్, కార్యవర్గసభ్యులుగా సాద అజయ్‌కుమార్, చిట్టి శ్రీనివాస్, డి.కరుణాకర్, సాద అమృత్‌రావు, మాయాపూర్ సాయన్న, గౌరవ సలహాదారులుగా రాజరత్నం, బ్యాగరి సుధాకర్, రావుల శ్యామ్యూల్, దుర్కి డేవిడ్, వినయ్‌సాగర్‌లను ఎన్నుకున్నారు. సోషల్‌డెమొక్రటిక్ అలయెన్స్ ప్రతినిధులు విజయ్ చంద్రప్రసాద్, సుధాకర్ పాల్గొన్నారు.