‘కేసీఆర్‌కు ఆ తీరిక కూడా లేదు’ | Komatireddy Venkat Reddy Comments on KCR | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌కు ఆ తీరిక కూడా లేదు’

Published Sat, Apr 14 2018 1:53 PM | Last Updated on Sun, Apr 7 2019 4:32 PM

Komatireddy Venkat Reddy Comments on KCR - Sakshi

సాక్షి, నల్గొండ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి భారత రాజ్యాంగ సృష్టికర్త బాబా సాహెబ్‌ అంబేద్కర్‌కు నివాళర్పించడానికి కూడా తీరిక లేదు. అన్ని రాష్ట్రాల సీఎంలు జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తుంటే.. కేసీఆర్‌ మాత్రం అహంకారంతో ప్రగతి భవన్‌లో కూర్చున్నాడు. కేసీఆర్‌ వ్యవహరించిన తీరు సిగ్గుచేటు. ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement