చండీగఢ్ / ఫగ్వాడా: భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి సందర్భంగా పంజాబ్‌లో కపుర్తలా జిల్లాలోని ఫగ్వాడాలో ఘర్షణలు జరిగాయి. రెండు హిందూ సంస్థలు, ఓ దళిత సంఘానికి చెందిన సభ్యుల మధ్య శుక్రవారం జరిగిన ఈ గొడవలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం కపుర్తలా, జలంధర్, హోషియార్‌పూర్, ఎస్బీఎస్ నగర్ జిల్లాలో మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని 24 గంటలపాటు నిలిపివేసింది. తొలుత అంబేడ్కర్ సేనకు చెందిన సభ్యులు కొందరు ఫగ్వాడాలోని గౌల్ కూడలిలో అంబేడ్కర్ చిత్రమున్న బోర్డును ఏర్పాటుచేయడంతో పాటు ఆ కూడలి పేరును సంవిధాన్ చౌక్‌గా మార్చేందుకు యత్నించారని పోలీసులు తెలిపారు. దీన్ని శివసేన బాల్‌థాకరే, హిందూ సురక్షా సమితి నేతలు వ్యతిరేకించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుందన్నారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment