అంబేడ్కర్‌.. తాత ఇంట్లో నివసించారు | Ambedkar must’ve lived in grandpa’s Satara house in early years: HC told | Sakshi

అంబేడ్కర్‌.. తాత ఇంట్లో నివసించారు

Published Wed, Mar 22 2017 8:30 AM | Last Updated on Mon, Oct 8 2018 6:22 PM

అంబేడ్కర్‌.. తాత ఇంట్లో నివసించారు - Sakshi

అంబేడ్కర్‌.. తాత ఇంట్లో నివసించారు

రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ బాల్యంలో సతారాలోని తాత ఇంట్లో కచ్చితంగా నివసించి ఉంటారని..

ముంబై: రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ బాల్యంలో సతారాలోని తాత ఇంట్లో కచ్చితంగా నివసించి ఉంటారని భావిస్తున్నందునే ఆ ఇంటిని రక్షిత నిర్మాణంగా ప్రకటించామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు బాంబే హైకోర్టులో మంగళవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది.

‘అంబేడ్కర్‌ తండ్రి రాంజీ మలోజీ సక్పల్‌ ఆ ప్రదేశంలో నివసించారు. ఆ ఆస్తి ఆయనకు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. అంబేడ్కర్‌ పేరు ప్రతాప్‌సింగ్‌ హైస్కూల్లో నమోదైంది. అప్పుడు ఆయన ఎక్కడ నివసించాడో రికార్డుల్లో లేకున్నా.. చుట్టుపక్కల ఇళ్లేవీ లేకపోవడంతో కచ్చితంగా తండ్రితో కలసి ఆ ఇంట్లోనే జీవించి ఉంటారు’ అని వివరించింది. ఈ ఆస్తిని ప్రభుత్వం రక్షణ నిర్మాణంగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ లక్ష్మణ్‌ ఆమ్నే అనే వ్యక్తి ఇటీవల కోర్టుకెక్కారు.  దీనిపై కోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement