లండన్: బాబా సాహెబ్ అంబేడ్కర్ జ్ఞాపకార్థం ఇక్కడ నిర్మించిన నూతన భవంతిలో ఆయన 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ వీరందర్ పాల్ అంబేడ్కర్ విగ్రహానికి పూలతో నివాళులు అర్పించారు. 1921-22లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదివే సమయంలో అంబేడ్కర్ ఇక్కడే నివసించారు.
గత ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్‌కు సంబంధించిన ఆస్తులను కొనుగోలు చేశాక ప్రధాని నరేంద్ర మోదీ యూకే పర్యటన సందర్భంగా వాటిని అధికారికంగా ప్రారంభించారు.మూడంతస్తులు,ఆరు గదులతో కూడిన ఈ భవనాన్ని త్వరలోనే ప్రజల సందర్శనకు అనుమతిస్తారు. ఇందులో అంబేడ్కర్ జీవిత విశేషాలను తెలిపే చిత్రాలు, ఆయన సూక్తులతో కూడిన గోడలు, ర చనా ప్రతులను భద్రపరిచారు. ఒక అంతస్తును.. ఇంగ్లండ్‌కు విద్యనభ్యసించడానికి వచ్చే భారత విద్యార్థులకు తాత్కాలిక నివాసంగా మార్చాలని భావిస్తున్నారు.
లండన్‌లో అంబేడ్కర్ జయంతి వేడుకలు
Published Fri, Apr 15 2016 3:45 AM | Last Updated on Mon, Oct 8 2018 6:22 PM
Advertisement
Advertisement