రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నిరసనలు
విజయవాడ: దళితులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంలో 13 జిల్లాల్లోని అంబేడ్కర్ విగ్రహాలకు వైఎస్సార్ సీపీ నాయకులు పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ జిల్లా: జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజంపేటలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, పోరుమామిళ్లలో ఎమ్మెల్యే జైరాములు, కడపలో ఎమ్మెల్యే అంజాద్ బాషా, కమలాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, జమ్మలముడుగులో వైఎస్సార్ సీపీ నేత సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించారు.
శ్రీకాకుళం: వైఎస్సార్ సీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ఆముదాలవలసలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
విజయనగరం: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రాజన్న దొర నేతృత్వంలో సాలూరులో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు.
విశాఖపట్టణం: నక్కపల్లి, ఎల్ఐసీ సర్కిల్ వద్ద వైఎస్సార్ సీపీ నేతలు రామకృష్ణ, గురువులు, జాన్వెస్లీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎన్ఏడీ జంక్షన్ వద్ద వైఎస్సార్ సీపీ నేత మళ్లా విజయ్ ప్రసాద్ నేతృత్వంలో కార్యక్రమాన్ని చేపట్టారు.
తూర్పుగోదావరి: ఏలేశ్వరంలో ఎమ్మెల్యే సుబ్బారాయుడు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. రాజమండ్రిలో ఆకుల వీర్రాజు నేతృత్వంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టారు.
పశ్చిమగోదావరి: మార్టేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు.
కృష్ణాజిల్లా: కైకలూరులో వైఎస్సార్ సీపీ నేత డీఎన్ఆర్ నేతృత్వంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు.
గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్సార్ సీపీ నేత అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రకాశం: వైఎస్సార్ సీపీ నేత వెంకటరెడ్డి ఆధ్వర్యంలో దర్శిలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెంలో జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్థన్రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టారు.
చిత్తూరు: పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్వంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం : అనంతపురం జిల్లాలో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు.
కర్నూలు: కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు.