రాష్ట్రవ్యాప్తంగా పది జిల్లాల్లో స్వేరోస్ (ఎస్సీ గురుకులాల పూర్వ విద్యార్థులు) నెట్‌వర్క్ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పది జిల్లాల్లో స్వేరోస్ (ఎస్సీ గురుకులాల పూర్వ విద్యార్థులు) నెట్‌వర్క్ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష ప్రారంభమైంది. కాన్షీరాం జయంతి (మార్చి 15) నుంచి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి (ఏప్రిల్ 14) వరకు నెలరోజుల పాటు నిర్వహించే ఈ దీక్షను మంగళవారం రాష్ట్రంలోని వివిధ బౌద్ధ క్షేత్రాల వద్ద మొదలుపెట్టారు.
దీక్ష సందర్భంగా అంబేడ్కర్ జీవితం, ఇతర మహనీయుల జీవిత విశేషాలపై పుస్తకాల పఠనం, చర్చ, చెడు అలవాట్లకు, మాంసాహారానికి దూరంగా ఉండటం, అంబేడ్కర్ చిత్రపటాలు, స్వేరోస్ పైలాన్ గుర్తును దగ్గర పెట్టుకోవడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాఠశాల, ఇంటి పరిసరాల్లో కనీసం పది చెట్ల పెంపకం, సాటి వారికి సహాయపడటం వంటివి పాటించనున్నారు.