
అందరికీ ఆరాధ్యుడు అంబేడ్కర్
కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏమీలేదని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నిరూపించారని, దళిత సామాజిక వర్గానికేకాక అన్నివర్గాలవారికి ఆరాధ్యుడయ్యారని వైఎస్సార్‌సీపీ
ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కల్లూరు: కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏమీలేదని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నిరూపించారని, దళిత సామాజిక వర్గానికేకాక అన్నివర్గాలవారికి ఆరాధ్యుడయ్యారని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులోని గురుకుల పాఠశాలలో గురువారం జరిగిన బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి వేడుకల్లో ఆయన ప్రసంగించారు.
అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం యావత్ ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉందన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన అంబేడ్కర్ ఆనాడు అనేకసార్లు వివక్షకు గురైనప్పటికీ కుంగిపోలేదని, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లి అందరికీ ఆదర్శప్రాయుడయ్యారన్నారు. అంబేడ్కర్ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎంపీ పొంగులేటి కోరారు.