
బడ్జెట్ ప్రతుల దహనం
బడ్జెట్‌లో ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిందని ఆరోపిస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక అంబేద్కర్....
దండేపల్లి : బడ్జెట్‌లో ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిందని ఆరోపిస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి పిట్టల తిరుపతి మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పిన ప్రభుత్వం బడ్టెట్‌లో తగినన్ని నిధులు కేటాయంచకపోవడం శోచనీయం అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల వారికి ఉన్నత విద్య భారం అవుతుందని తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు శివగణేశ్, రాహుల్, సంతోశ్, రాజశేఖర్, తిరుమలేశ్, సుధీర్, మహేశ్, కార్తీక్, విద్యార్థులు పాల్గొన్నారు.