ఎన్నికలు నిర్వహించండి ఎల్జీకి ఆప్ విజ్ఞప్తి | Hold election in Delhi, Prashant Bhushan urges Lt Governor Najeeb Jung | Sakshi
Sakshi News home page

ఎన్నికలు నిర్వహించండి ఎల్జీకి ఆప్ విజ్ఞప్తి

Published Sat, Apr 19 2014 12:17 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

ఎన్నికలు నిర్వహించండి  ఎల్జీకి ఆప్ విజ్ఞప్తి - Sakshi

ఎన్నికలు నిర్వహించండి ఎల్జీకి ఆప్ విజ్ఞప్తి

 న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికలు తొందరగా నిర్వహించాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌ను కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత ప్రశాంత్ భూషణ్. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయడానికి ఎల్జీకి ఎలాంటి కాలపరిమితీ లేదని సుప్రీంకోర్టు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏ సమయంలోనైనా రాష్ట్రపతి పాలన ఎత్తివేసేందుకు ఆయనకు అధికారాలు ఉన్నాయని వివరణ ఇచ్చింది.

 కాబట్టి సత్వరమే ఎన్నికలు నిర్వహించాలని ఆయన ఎల్జీని కోరారు. ‘‘70 అసెంబ్లీ సీట్లకు గాను 31 గెలుచుకుని అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ నేతలను ఆహ్వానించి ప్రభుత్వ ఏర్పాటుకు వారు సిద్ధంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవాలని మేం వినయపూర్వకంగా కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు.

 ఈ ఆప్‌నేత. ‘‘ఒకవేళ వాళ్లు ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా లేకపోతే గతంలో మీరు చేసిన సూచనలను పునఃసమీక్షించి సరైన నిర్ణయం తీసుకోండి. దానివల్ల తొందరగా ఢిల్లీ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి అవకాశముంటుంది’’ అని లేఖలో పొందుపరిచారు. ఈ మార్చి 31న దాదాపు ఇలాంటి లేఖనే ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా జంగ్‌కు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement