najibjang
-
మోదీతో నజీబ్ భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) పదవికి గురువారం రాజీనామా చేసిన నజీబ్‌జంగ్ శుక్రవారం ప్రధాని మోదీని కలిశారు. ప్రధాని కార్యాలయంలో గంటపాటు గడిపారు. తనకు ఇన్నాళ్లు సహాయ సహకారాలు అందించిన మోదీకి నజీబ్ కృతజ్ఞతలు తెలిపడానికే ప్రధానిని కలిసినట్లు పీఎంవో వర్గాలు చెప్పాయి. తాను ఓ పుస్తకాన్ని రాస్తున్నట్లు మోదీతో నజీబ్ చెప్పార న్నాయి. నజీబ్‌కు మోదీతో ఉన్న సంబంధాలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ నజీబ్ల భేటీ చర్చనీయాంశమైంది. సీఎం కేజ్రీవాల్ శుక్రవారం ఉదయం నజీబ్‌జంగ్‌ను రాజ్‌నివాస్‌లో కలిశారు. నజీబ్ తనను అల్పాహారానికి పిలిచినట్లు కేజ్రీవాల్ చెప్పారు. వ్యక్తిగత కారణాలతోనే నజీబ్ రాజీనామా చేశారని, ఇందులో రాజకీయ అంశమేమీ లేదని కేజ్రీవాల్ అన్నారు. -
ఎన్నికలు నిర్వహించండి ఎల్జీకి ఆప్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికలు తొందరగా నిర్వహించాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌ను కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత ప్రశాంత్ భూషణ్. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయడానికి ఎల్జీకి ఎలాంటి కాలపరిమితీ లేదని సుప్రీంకోర్టు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏ సమయంలోనైనా రాష్ట్రపతి పాలన ఎత్తివేసేందుకు ఆయనకు అధికారాలు ఉన్నాయని వివరణ ఇచ్చింది. కాబట్టి సత్వరమే ఎన్నికలు నిర్వహించాలని ఆయన ఎల్జీని కోరారు. ‘‘70 అసెంబ్లీ సీట్లకు గాను 31 గెలుచుకుని అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ నేతలను ఆహ్వానించి ప్రభుత్వ ఏర్పాటుకు వారు సిద్ధంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవాలని మేం వినయపూర్వకంగా కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ ఆప్‌నేత. ‘‘ఒకవేళ వాళ్లు ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా లేకపోతే గతంలో మీరు చేసిన సూచనలను పునఃసమీక్షించి సరైన నిర్ణయం తీసుకోండి. దానివల్ల తొందరగా ఢిల్లీ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి అవకాశముంటుంది’’ అని లేఖలో పొందుపరిచారు. ఈ మార్చి 31న దాదాపు ఇలాంటి లేఖనే ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా జంగ్కు ఇచ్చారు.