ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) పదవికి గురువారం రాజీనామా చేసిన నజీబ్‌జంగ్ శుక్రవారం ప్రధాని మోదీని కలిశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) పదవికి గురువారం రాజీనామా చేసిన నజీబ్‌జంగ్ శుక్రవారం ప్రధాని మోదీని కలిశారు. ప్రధాని కార్యాలయంలో గంటపాటు గడిపారు. తనకు ఇన్నాళ్లు సహాయ సహకారాలు అందించిన మోదీకి నజీబ్ కృతజ్ఞతలు తెలిపడానికే ప్రధానిని కలిసినట్లు పీఎంవో వర్గాలు చెప్పాయి.
తాను ఓ పుస్తకాన్ని రాస్తున్నట్లు మోదీతో నజీబ్ చెప్పార న్నాయి. నజీబ్‌కు మోదీతో ఉన్న సంబంధాలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ నజీబ్‌ల భేటీ చర్చనీయాంశమైంది. సీఎం కేజ్రీవాల్ శుక్రవారం ఉదయం నజీబ్‌జంగ్‌ను రాజ్‌నివాస్‌లో కలిశారు. నజీబ్ తనను అల్పాహారానికి పిలిచినట్లు కేజ్రీవాల్ చెప్పారు. వ్యక్తిగత కారణాలతోనే నజీబ్ రాజీనామా చేశారని, ఇందులో రాజకీయ అంశమేమీ లేదని కేజ్రీవాల్ అన్నారు.