మరో రెండ్రోజులు గడువివ్వండి: కేజ్రీవాల్ | Election Commission grants two more days to Arvind Kejriwal to reply to its notice | Sakshi
Sakshi News home page

మరో రెండ్రోజులు గడువివ్వండి: కేజ్రీవాల్

Published Tue, Nov 26 2013 1:21 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

Election Commission grants two more days to Arvind Kejriwal to reply to its notice

న్యూఢిల్లీ: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ తనకు జారీ చేసిన నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు మరో రెండ్రోజులు గడువివ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఎన్నికల సంఘాన్ని కోరారు. మతప్రాతిపదికన ఓట్లను కొల్లగొట్టేందుకే ముస్లింలకు కరపత్రాలను పంచారని, ఇతర రాజకీయ పార్టీల వ్యూహాలకు బలికాకుండా స్వచ్ఛమైన రాజకీయాల కోసం ముస్లింలు తమకే ఓటు వేయాలంటూ కరపత్రాల్లో కోరారని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఆరోపిస్తూ మదన్‌లాల్ ఖురానా తనయుడు హరీశ్ ఖురానా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం  కరపత్రాలు పంచుతూ ముస్లిం ఓటర్లను అభ్యర్థించినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, దీనిపై 25వ తేదీన ఉదయం 11 గంటలకు వివరణ ఇవ్వాలంటూ 20వ తేదీన కేజ్రీవాల్‌కు నోటీసులు పంపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement