ఆయన ఇంటిపై 'రంగు' పడింది! | Ink attack at Prashant Bhushan house | Sakshi
Sakshi News home page

ఆయన ఇంటిపై 'రంగు' పడింది!

Published Mon, Apr 3 2017 3:56 PM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM

ఆయన ఇంటిపై 'రంగు' పడింది!

ఆయన ఇంటిపై 'రంగు' పడింది!

శ్రీకృష్ణుడు కూడా ఈవ్‌టీజరే అంటూ ప్రముఖ న్యాయవాది, స్వరాజ్‌ అభియాన్‌ పార్టీ సహ స్థాపకుడు  ప్రశాంత్‌ భూషణ్‌ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.  శ్రీకృష్ణుడిని కించపరుస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే బీజేపీ సహా పలువురు వ్యక్తులు కేసులు నమోదు చేశారు. తాజాగా నోయిడా, సెక్టర్‌ 14లోని ఆయన నివాసంపై కొందరు వ్యక్తులు ఇంకుతో దాడి చేశారు.

శ్రీకృష్ణుడిపై వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలంటూ ఏడెనిమిది మంది భూషణ్‌ ఇంటిముందు గుమిగూడి నినాదాలు చేశారని, ఆ తర్వాత ఇంటిపై, నేమ్‌ప్లేటుపై ఇంకు చల్లి నిరసన తెలిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ సమయంలో ప్రశాంత్‌ భూషణ్‌ ఇంట్లో లేరు. ఆయన ఇంట్లో పనిచేసేవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చేలోపే వారు వెళ్లిపోయారు. పోలీసులు గంటసేపు ఉండి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదు.

'రోమియో ఒక్క అమ్మాయిని మాత్రమే ప్రేమించాడు. కానీ కృష్ణుడు లెజండరీ ఈవ్‌టీజర్‌. తన విజిలెంట్స్‌ను యాంటికృష్ణస్క్వాడ్‌ అని పిలిచే దమ్ము యోగిఆదిత్యనాథ్‌కు ఉందా' అంటూ భూషణ్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.  హిందూ దేవుడు శ్రీకృష్ణుడిపై రెచ్చగొట్టే విధంగా ట్వీట్లు చేశారని ఆరోపిస్తూ బీజేపీ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement