ప్రశాంత్ భూషణ్(ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ: సీబీఐ చీఫ్ రంజిత్ సిన్హాను కలిసిన వారి వివరాలకు సంబంధించిన ఆధారాలు చూపాలని లాయర్ ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. రంజిత్ సిన్హా నివాసానికి వచ్చి వెళ్లినవారి వివరాలుండే సందర్శకుల జాబితా ఎక్కడినుంచి వచ్చిందో వెల్లడించాలని పేర్కొంది. జాబితా అందజేసిన ‘ప్రజా వేగు’ వివరాలు సీల్డ్ కవర్‌లో పెట్టి అందజేయాలని సూచించింది.
జాబితాలో పేర్కొన్న వివరాలు 90 శాతం బోగస్ అని, పదిశాతం మాత్రమే కచ్చితంగా ఉన్నాయని కోర్టుకు రంజిత్ సిన్హా తెలిపారు. ఈ కేసుపై తదుపరి విచారణను అత్యున్నత న్యాయస్థానం ఈనెల 22కు వాయిదా వేసింది. 2జీ కేసులో నిందితులు సీబీఐ చీఫ్‌తో ఆయన ఇంట్లో చాలాసార్లు సమావేశమయ్యారని, దీనికి సందర్శకుల జాబితాయే నిదర్శనమని, ఆయన్ను 2జీ కేసు నుంచి తప్పించాలని భూషణ్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.