సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వచ్చే ఏడాది జపాన్, దక్షిణ కొరియా నుంచి పరిశ్రమలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేకానంద అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను వారికి వివరించామన్నారు. మంత్రి కేటీఆర్ బృందంతో కలసి ఈ రెండు దేశాల్లో పర్యటించిన విశేషాలను సోమవారం విలేకరులకు వివరించారు.
కొరియా సహకారంతో వరంగల్‌లో ఏవియేషన్ అకాడమీ ఏర్పాటు చేయనున్నామన్నారు. అక్కడ ఏర్పాటు చేస్తోన్న మెగా టెక్స్‌టైల్స్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని ఆ దేశ పారిశ్రామికవేత్తలను కోరామన్నారు. టెక్స్‌టైల్స్ ఉత్పత్తుల ప్రదర్శన కోసం నగరంలో ఫ్యాషన్ సిటీతో పాటు కొరియా లాంగ్వేజ్ సెంటర్ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ అంగీకరించినట్లు తెలిపారు. క్లీన్ ఎనర్జీ, పౌల్ట్రీ రంగాల్లో సహకారం కోసం జపాన్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ స్థాపన కోసం సుజూకీతో చర్చలు జరిపామన్నారు.
వచ్చే నెలలో కొరియా కాన్సులేట్
హైదరాబాద్‌లో ఫిబ్రవరిలో దక్షిణ కొరియా కొత్త కాన్సులేట్‌ను కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి ప్రారంభించానున్నారని తెలంగాణలో కొరియన్ గౌరవ కాన్సుల్ జనరల్ సురేశ్ చుక్కపల్లి తెలిపారు.
రాష్ట్రంలో జపాన్, కొరియా పరిశ్రమలు
Published Tue, Jan 23 2018 1:59 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment