Japan companies
-
జపాన్ కంపెనీల హవా.. చైనా బ్రాండ్లకు దెబ్బ!
కొరియన్, చైనా బ్రాండ్ల దెబ్బకు భారత్‌లో జపాన్ కంపెనీ ఉత్పత్తుల విక్రయాలు కొంతకాలంగా తగ్గిపోయాయి. ఇటీవల కాలంలో జపాన్ కంపెనీలు అనుసరిస్తున్న విధానాల వల్ల తిరిగి ఇండియాలో వాటి ఉత్పత్తుల అమ్మకాలు పుంజుకుంటున్నట్లు కంపెనీలు పేర్కొన్నాయి. సోనీ , పానాసోనిక్, హిటాచీ వంటి జపాన్ ఎలక్ట్రానిక్ బ్రాండ్లకు భారత్‌లో మంచి ఆదరణ ఉంది. కానీ కొరియన్, చైనా బ్రాండ్ల దెబ్బకు వాటి అమ్మకాలు స్థానికంగా తగ్గిపోయాయి. దాంతో జపాన్ కంపెనీలు కొత్త విధానాలను అమలు చేస్తూ తిరిగి వాటి ఉత్పత్తుల అమ్మకాలను పునరుద్ధరిస్తున్నాయి.ఎక్కువ మార్జిన్లు ఉండే ఉత్పత్తులు, బిగ్‌స్క్రీన్ టీవీలను విక్రయించడం, తక్కువ మార్జిన్లు ఉండే వాటిని నిలిపేయడం వంటి విధానాలను పాటిస్తున్నాయి. ప్రధానంగా జపాన్ కంపెనీలు ఇండియాలో టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఇతర గృహోపకరణాలను విక్రయిస్తున్నాయి. పానాసోనిక్ కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో పెరిగాయి. దాదాపు ఆరేళ్ల పాటు వృద్ధి, అమ్మకాల విషయంలో తిరోగమన పథంలో ఉన్న కంపెనీ ఉత్పత్తులు ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 30% పైగా పుంజుకున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.2,338 కోట్ల వ్యాపారంతో పోలిస్తే వినియోగదారుల విభాగంలో 2025లో రూ.3,000 కోట్ల కంటే ఎక్కువ అమ్మకాలను లక్ష్యంగా చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది.అమ్మకాలు జూమ్సోనీ ఇండియా గత ఎనిమిదేళ్లలో ఈసారి అత్యుత్తమ నికర లాభాన్ని నమోదు చేసింది. సోనీ బ్రావియా టెలివిజన్ల అమ్మకాల్లో 20% కంటే ఎక్కువ వృద్ధిని సాధించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో సోనీ ఇండియా అమ్మకాలు రూ.7,663 కోట్లుగా ఉన్నాయి. 2014-15లో గరిష్టంగా కంపెనీకి రూ.11,000 కోట్ల రెవెన్యూ సమకూరింది. తర్వాత ఈసారి వచ్చిన ఆదాయమే అధికంగా ఉంది.చైనా బ్రాండ్లతో పోటీపానాసోనిక్ ఇండియా బిజినెస్ ఛైర్మన్ మనీష్ శర్మ మాట్లాడుతూ..‘జపాన్ బ్రాండ్లు ధరల విషయంలో పోటీ పడటం లేదు. నిర్వహణ ఖర్చులు తగ్గించుకుంటూ, వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నాయి. వైఫల్యాల రేటును గణనీయంగా తగ్గించుకోవాలనుకుంటున్నాం. భారత్‌లో క్రమంగా విక్రయాలు పెరుగుతున్నాయి. షావోమీ, హైసెన్స్, హాయర్ వంటి చైనీస్ బ్రాండ్లు, కొడాక్, థామ్సన్ వంటి ఆన్లైన్ కేంద్రీకృత బ్రాండ్ ఉత్పత్తులకు మార్కెట్లో అధిక ధరలున్నాయి. కొరియన్ కంపెనీలైన ఎల్జీ, సామ్‌సంగ్‌లతో కూడా జపాన్ కంపెనీలు పోటీ పడుతున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటనఎయిర్ కండీషనర్ తయారీ రంగంలో ఉన్న జపాన్ కంపెనీ హిటాచీ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో లాభాలు నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదిక 64% అమ్మకాలు పెరగడం ద్వారా రూ.1,392 కోట్ల ఆదాయం సమకూరినట్లు కంపెనీ తెలిపింది. -
handsome weeping boys: కరువుతీరా ఏడ్చెయ్యండి! వీపింగ్ బాయ్ తుడిచేస్తాడు!
కోపం, బాధ, సంతోషం వంటి భావోద్వేగాలను వ్యక్తం చేయడంలో ఇతర దేశాల వారికంటే జపాన్ వాసులు వెనుకబడి ఉన్నారు. దీంతో వారు చేసే ఉద్యోగ, వ్యాపారాల్లో సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీని వల్ల ఆయా కంపెనీల రెవెన్యూలపై ప్రభావం పడుతోంది. ఇది గమనించిన అక్కడి కంపెనీలు ‘హ్యాండ్సమ్ వీపింగ్ బాయిస్’ పేరిట పరిష్కార మార్గం వెతికాయి. ఉద్యోగులు పెట్టే కన్నీరు తుడిచి వారిని ఓదార్చడమే ఈ హ్యాండ్సమ్ వీపింగ్ బాయిస్ పని. ఉద్యోగి మనసులోని భారం మొత్తం దిగిపోతే మరింత చురుగ్గా పనిచేస్తారు. దీనికోసం అందంగా ఉండే అబ్బాయిలను వీపింగ్ బాయిస్‌గా నియమించుకుంటున్నాయి. ఏడ్పించి... కంపెనీలోని కొంతమంది ఉద్యోగులను ఒక రూమ్‌లో కూర్చోబెడతారు. వీరందరికి ఏడుపు వచ్చే సినిమాలు చూపిస్తారు. వీటిలో పెంపుడు కుక్కలను బాధించేవీ,తండ్రీ కూతుళ్ల మధ్య ప్రేమానుబంధాలు వంటి సన్నివేశాలు ఉంటాయి. అవి చూస్తూ బాధ కలిగిన వెంటనే ఉద్యోగులు గొంతు విప్పి మనసారా ఏడవచ్చు. ఇలా ఏడుస్తోన్న వ్యక్తి కన్నీళ్లను హ్యాండ్సమ్ వీపింగ్ బాయ్ కాటన్ కర్చీఫ్‌తో ప్రేమగా తుడుస్తాడు. ఇలా అక్కడ ఉన్న వారందరి బాధను వీపింగ్ బాయ్ తన ప్రేమతో, ఓదార్పు మాటలతో పూర్తిగా ఓదార్చుతాడు. ఇలా కంపెనీ ఉద్యోగుల కన్నీరు తుడిచేసి మరీ చక్కగా పనిచేయించుకుంటున్నాయి జపాన్ కంపెనీలు. ఒకసారి నలుగురిలో కన్నీరు పెట్టడం అలవాటైతే వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలను చక్కగా పరిష్కరించుకోగలుగుతారు అని వారు చెబుతున్నారు. టోక్యోకు చెందిన ‘క్రైయింగ్ వర్క్‌షాపు’ వ్యవస్థాపకుడు హిరోకి టెకాయ్కు వచ్చిన ఐడియానే వీపింగ్ బాయ్. ఆలోచన వచ్చిన తరవాత అనేక వర్క్ షాపులు నిర్వహించి ఈ వీపింగ్ బాయ్‌ను అమలులోకి తెచ్చి పరీక్షించాడు. మంచి ఫలితాలు రావడంతో తన ఆఫీసులోనే వీపింగ్ బాయిస్‌ను నియమించడం మొదలు పెట్టాడు. వర్క్‌షాపులను అందమైన అబ్బాయిలు చక్కగా నిర్వహించడంతో హ్యాండ్సమ్ బాయిస్‌ను వీపింగ్ బాయిస్‌గా ఎంచుకున్నాడు. అందమైన అబ్బాయిలు ఓదార్పునిస్తే కొత్త ఉత్సాహం కలుగుతుంది. అందుకే అందమైన అబ్బాయిలను ఈ పనికి ఎన్నుకున్నట్లు టెకాయ్ చెబుతున్నాడు. ఆ మధ్య నవ్వడం నేర్చుకోవడం మొదలు పెట్టి జపాన్ ఉద్యోగులు నేడు నలుగురిలో సిగ్గుపడకుండా ఏడవడం నేర్చుకోవడం కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ... గుంyð ల్లో ఉన్న భారం దిగిపోతే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. సిగ్గు, బిడియం, బాధ పోయినప్పుడు అందరితో కలిసి మెలిసి తిరగగలుగుతారు. -
భారత్ మార్కెట్లో జపాన్ టీవీ, ధర ఎంతంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంజ్యూమర్ ఎల్రక్టానిక్స్ తయారీలో ఉన్న జపాన్ కంపెనీ ఐవా తాజాగా భారత మార్కెట్లో మ్యాగ్నిఫిక్ పేరుతో స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టింది. ఫుల్ హెచ్డీ, అల్ట్రా హెచ్డీ, 4కే యూహెచ్డీ టీవీలను 32–65 అంగుళాల సైజులో రూ.29,990 నుంచి రూ.1,39,990 ధరల శ్రేణిలో అందుబాటులోకి తెచ్చింది. బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్ట్, ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్–4 ప్రాసెసర్, ఆన్‌డ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రూపుదిద్దుకున్నాయి. ఇన్‌బిల్ట్ సౌండ్ బార్ 55, 65 అంగుళాల టీవీల ప్రత్యేకత. దేశవ్యాప్తంగా 300 రిటైలర్స్ ద్వారా టీవీలను విక్రయించనున్నట్టు ఐవా ఇండియా ఎండీ అజయ్ మెహతా వెల్లడించారు.‘ఏడాదిలో రిటైలర్ల సంఖ్యను 3,500లకు చేరుస్తాం. వ్యాపార విస్తరణకు రెండేళ్లలో రూ.160 కోట్లు ఖర్చు చేస్తాం. భారత్‌లో టీవీల తయారీకై డిక్సన్ టెక్నాలజీస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టీవీలు, ఆడియో ఉత్పత్తుల అమ్మకాల ద్వారా రూ.400 కోట్ల టర్నోవర్ ఆశిస్తున్నాం. 4–5 ఏళ్లలో రూ.8,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నాం. ఇందుకు వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల వంటి ఉత్పత్తులను ప్రవేశపెడతాం’ అని వివరించారు. 1951లో ఐవా ప్రారంభమైంది. ఈ సంస్థ భారత్‌లో 2021 ఏప్రిల్‌లో రీ–ఎంట్రీ ఇచ్చింది. -
భారత్‌లో మరింత ఇన్వెస్ట్ చేయండి
టోక్యో: అపార వ్యాపార అవకాశాలు ఉన్న భారత్‌లో మరింతగా ఇన్వెస్ట్ చేయాలంటూ జపాన్ కార్పొరేట్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో జపాన్‌ది చాలా కీలకపాత్ర అని ఆయన పేర్కొన్నారు. దీన్ని పురస్కరించుకుని ’జపాన్ వారోత్సవాల’ను నిర్వహించడంపై ప్రధాని ప్రతిపాదన చేశారు. జపాన్ పర్యటనలో భాగంగా వ్యాపార దిగ్గజాలతో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. 34 సంస్థల సీఈవోలు, టాప్ ఎగ్జిక్యూటివ్‌లు దీనికి హాజరయ్యారు. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఉక్కు, టెక్నాలజీ, ట్రేడింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్ తదితర రంగాల కంపెనీల ప్రతినిధులు వీరిలో ఉన్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. జపాన్ కంపెనీలు భారత్‌లో మరింతగా ఇన్వెస్ట్ చేయాలని మోదీ ఈ సందర్భంగా ఆహ్వానించినట్లు వివరించింది. ‘టాప్ వ్యాపార సంస్థల సీఈవోలతో భేటీ అయ్యాను. భారత్‌లో పుష్కలంగా ఉన్న పెట్టుబడి అవకాశాల గురించి వివరించాను‘ అని ప్రధాని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. హోండా, సుజుకీ, టయోటా వంటి ఆటోమొబైల్ సంస్థలు, సుమిటోమో కెమికల్, ఫ్యుజిత్సు, నిప్పన్ స్టీల్ కార్పొరేషన్, మిత్సుబిషి కార్పొరేషన్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. చాలామటుకు కంపెనీలకు భారత్‌లో పెట్టుబడులు, కార్యకలాపాలు ఉన్నాయి. రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు.. భారత్, జపాన్ సహజమైన భాగస్వాములని సమావేశం సందర్భంగా ప్రధాని చెప్పారు. భారత్–జపాన్ సంబంధాలు బలోపేతం అయ్యేందుకు వ్యాపార వర్గాలు బ్రాండ్ అంబాసిడర్ల పాత్ర పోషిస్తున్నారని ఆయన ప్రశంసించారు. గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) అంతర్జాతీయంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) మందగించినా, భారత్‌లోకి రికార్డు స్థాయిలో 84 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. భారత ఆర్థిక వృద్ధి సత్తాపై ఇన్వెస్టర్లకు ఉన్న ధీమాకు ఇది నిదర్శనమని ఆయన తెలిపారు. ఈ ఏడాది మార్చిలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా భారత పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక పెట్టుబడులను వచ్చే అయిదేళ్లలో 5 లక్షల కోట్ల ఎన్ల స్థాయికి పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయని ప్రధాని చెప్పారు. ఇటీవలి కాలంలో ఇండియా–జపాన్ ఇండస్ట్రియల్ కాంపిటీటివ్నెస్ పార్ట్నర్షిప్ (ఐజేఐసీపీ), క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ మొదలైన ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు. -
రాష్ట్రంలో జపాన్, కొరియా పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వచ్చే ఏడాది జపాన్, దక్షిణ కొరియా నుంచి పరిశ్రమలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేకానంద అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను వారికి వివరించామన్నారు. మంత్రి కేటీఆర్ బృందంతో కలసి ఈ రెండు దేశాల్లో పర్యటించిన విశేషాలను సోమవారం విలేకరులకు వివరించారు. కొరియా సహకారంతో వరంగల్‌లో ఏవియేషన్ అకాడమీ ఏర్పాటు చేయనున్నామన్నారు. అక్కడ ఏర్పాటు చేస్తోన్న మెగా టెక్స్టైల్స్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని ఆ దేశ పారిశ్రామికవేత్తలను కోరామన్నారు. టెక్స్టైల్స్ ఉత్పత్తుల ప్రదర్శన కోసం నగరంలో ఫ్యాషన్ సిటీతో పాటు కొరియా లాంగ్వేజ్ సెంటర్ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ అంగీకరించినట్లు తెలిపారు. క్లీన్ ఎనర్జీ, పౌల్ట్రీ రంగాల్లో సహకారం కోసం జపాన్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ స్థాపన కోసం సుజూకీతో చర్చలు జరిపామన్నారు. వచ్చే నెలలో కొరియా కాన్సులేట్ హైదరాబాద్‌లో ఫిబ్రవరిలో దక్షిణ కొరియా కొత్త కాన్సులేట్‌ను కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి ప్రారంభించానున్నారని తెలంగాణలో కొరియన్ గౌరవ కాన్సుల్ జనరల్ సురేశ్ చుక్కపల్లి తెలిపారు. -
రెండో టోక్యోగా అమరావతి
- రాజధానిని నిర్మించే బాధ్యత తీసుకోవాలి - జపాన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, విజయవాడ: జపాన్ కంపెనీలు టోక్యోను మొదటి ఇల్లుగాను, అమరావతిని రెండో ఇల్లుగానూ పరిగణించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. జపాన్ ఆర్థిక, వాణిజ్య మంత్రి యసూకి టకాగి నాయకత్వంలో 80 మంది ప్రతినిధుల బృందం సోమవారం నగరానికి వచ్చింది. విజయవాడ గేట్‌వే హోటల్లో ఈ బృందంతో ముఖ్యమంత్రి సమావేశమై మాట్లాడుతూ.. సాంకేతిక విషయాల్లో ఎంతో ముందంజలో ఉన్న జపాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ నేర్చుకునే దశలో ఉందన్నారు. టోక్యో మాదిరి అమరావతి అభివృద్ధి చెందేందుకు జపాన్ వాణిజ్య సంస్థలు సహకరించాలని కోరారు. అమరావతి నిర్మాణంలోనూ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో అమరావతి నుంచి టోక్యోకు నేరుగా విమానాలు నడుపుతామని చెప్పారు. ఈ సందర్భంగా జపాన్ కంపెనీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాయి. సార్ట్ గ్రిడ్ ఫీడర్ మేనేజ్మెంట్ , స్మార్ట్ గ్రిడ్ మీటర్స్ మేనేజ్మెంట్ రెన్యువవబుల్ ఎనర్జీ మేనేజ్మెంట్ అంశాలపై పనిచేసేందుకు ప్యూజీ ఎలక్ట్రిక్ కంపెనీ ముందుకు వచ్చింది. జపాన్ కంపెనీలకు సీఎం హామీల జోరు నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు పలు జపాన్ కంపెనీలు ముందుకు వాటికి కావాల్సిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చారు. స్మార్ట్ సిటీ నిర్మాణం, ఎనర్జీ మేనేజ్మెంట్లలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు హిటాచీ కంపెనీ ఆసక్తి కనబరచగా.. ఏపీలో ఇప్పటికే ఎల్ఈడీ బల్బులు, ఎనర్జీసేవింగ్ పంపుసెట్లు అందించామని కొత్త ఆలోచనలతో ముందుకు వస్తే పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. నాణ్యమైన ఉత్పత్తులు లేకే ఆదరణ కరువు రాష్ట్రంలో పండ్ల ఉత్పత్తిలో నాణ్యత లేకపోవడం, తక్కువ దిగుబడి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఆదరణ పొందలేకపోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడ లయోలా కళాశాల ప్రాంగణంలో హార్టికల్చర్ షో, మ్యాంగో ఫెస్టివల్-2016ను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నాణ్యతతో కూడిన ఉత్తమ ఉద్యాన పంటలను రైతు నుంచి మార్కెట్ స్థాయి వరకు చేరవేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. నేడు అస్సాంకు చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం అస్సాంకు వెళ్లనున్నారు. అక్కడ ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సోనోవాల్ పదవీ స్వీకారంలో పాల్గొననున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు గువాహటి చేరుకుంటారు. ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న అనంతరం రాత్రికి విజయవాడ చేరుకుంటారు. -
ఐక్లీన్లో జపాన్ కంపెనీ పెట్టుబుడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటిగ్రేటెడ్ క్లీన్‌రూమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఐక్లీన్)లో 26శాతం వాటాను జపాన్‌కు చెందిన టకసాగో థర్మల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (టీటీఈ) కొనుగోలు చేసింది. కానీ ఈ వాటాను ఎంత మొత్తానికి కొనుగోలు చేసింది తెలియచేయలేదు. 98 ఏళ్ల నుంచి ఇంజనీరింగ్ సేవల్లో ఉండి 2.5 బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగి ఇంధన పొదుపులో అనేక పేటెంట్లు ఉన్న టీటీఈ భాగస్వామిగా చేరడం ద్వారా మరిన్ని రంగాలకు, దేశాలకు విస్తరించగలమన్న ధీమాను ఐక్లీన్ వ్యక్తం చేసింది. ఈ ఒప్పందం వివరాలను తెలియచేయడానికి బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐక్లీన్ ఫౌండర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ కె.గోపీ మాట్లాడుతూ టీటీఈ జపాన్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదై ఉండటంతో ఒప్పందం విలువను ఇప్పుడే తెలియచేయలేమన్నారు. ప్రస్తుతం ఐక్లీన్ కంపెనీ టర్నోవర్ రూ. 310 కోట్లని, మూడేళ్లలో ఏటా 40 శాతం వృద్ధితో రూ. 1,000 కోట్ల మార్కును అధిగమించాలని లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం ఐక్లీన్కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో మొత్తం మూడు తయారీ కేంద్రాలు ఉన్నాయి. త్వరలోనే మరో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గోపి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీఈ జనరల్ మేనేజర్ మసాటో నకమురా మాట్లాడుతూ ఐక్లీన్తో చేతులు కలపడం ద్వారా మరిన్ని దేశాలకు వేగంగా విస్తరించే అవకాశం ఉందన్నారు. -
ఆ భూములతో వ్యాపారం చేస్తాం
-
ఆ భూములతో వ్యాపారం చేస్తాం
సీఆర్డీఏ సమీక్షలో సీఎం సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణానికి ముందుకొచ్చే సింగపూర్, జపాన్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని వ్యాపారం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రైతుల నుంచి సేకరించిన భూమిని ప్రైవేటు కంపెనీలకు అభివృద్ధికిచ్చి వారితో కలిసి తాము కూడా పెట్టుబడులు పెట్టి లాభాలు అర్జిస్తామన్నారు. ఇందుకోసం అమరావతి డెవలప్మెంట్ కంపెనీని ఏర్పాటు చేస్తామన్నారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పెట్టుబడులు ఎంత పెట్టాలి, ఏ నిష్పత్తిలో వ్యాపారం చేయాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలిపారు. సింగపూర్ ప్రభుత్వ కంపెనీలు ఇలా టౌన్‌షిప్‌లు కట్టి లాభాలు సాధించాయని, సింగపూర్‌లోని తమాసిన్ కంపెనీ ఇదే తరహాలో ఏడు లక్షల కోట్ల టర్నోవర్ సాధించిందని తెలిపారు. రాజధాని కోసం రైతులు ఇప్పటికే 33 వేల ఎకరాలు ఇచ్చారని, ఈ ప్రాంతంలోనే మరో 50 వేల ఎకరాల అటవీ భూమిని డీనోటిఫై చేయిస్తామని చెప్పారు ఈ 83 వేల ఎకరాలను ప్రైవేటు కంపెనీలకు అభివృద్ధికిచ్చి, అందులో తాము పెట్టుబడులు పెడతామన్నారు. వచ్చే లాభాలను పంచుకుంటామని, రియల్ ఎస్టేట్ కంపెనీలాగే పనిచేస్తామని తెలిపారు.2018 నాటికి పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములను భూసేకరణ ద్వారా తీసుకోవడానికి డబ్బు లేదన్నారు. పండుగలా శంకుస్థాపన రాజధాని శంకుస్థాపన కార్యక్రమం దసరా పండుగలా జరగాలని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన సీఆర్డీఏ కమిటీతో సమీక్ష నిర్వహించారు. శంకుస్థాపనకు ప్రధాని వస్తానని మాటిచ్చినట్లు చెప్పారు. శంకుస్థాపనకు అన్ని గ్రామాల సర్పంచ్‌లు తమ గ్రామంలోని కొంత మట్టి తెచ్చి అమరావతి మట్టిలో కలిపి భావోద్వేగం నింపాలన్నారు. అవగాహన ఒప్పందాలు ఖరారు ఇంధన రంగంలో ఉజ్వల భవితకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే కాకినా డ డీప్ సీ వాటర్ పోర్టులో ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విజ యవాడ గేట్ వే హోటల్లో సీఎం సమక్షంలో ఏపీ గ్యాస్ డెవలప్మెం ట్ కార్పొరేషన్ , గెయి ల్, షెల్, ఇంజీ కంపెనీలు రెండు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.రానున్న 13నెలల్లో కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు గ్యాస్ పైప్‌లైన్ నిర్మిస్తామని బాబు హామీ ఇచ్చారు. -
ఏపీలోని 3 వర్సిటీల్లో జపనీస్ బోధన
హైదరాబాద్: జపాన్ ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రైవేటు కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కనపరుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జపాన్ భాషా బోధనను అమలు పరిచేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ బాధ్యతను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డికి అప్పగించింది. దాంతో ప్రాథమిక స్థాయినుంచి ఓ యజ్ఞంలా దీన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జపాన్ భాష తప్పనిసరిగా తెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఏపీలో మూడు విశ్వవిద్యాలయాల్లో జపనీస్ భాషను ప్రవేశపెట్టనుంది. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ, గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలలో జపాన్ భాషా శిక్షణ తరగతులు నిర్వహించనుంది, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో జపాన్ కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వస్తున్న తరుణంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలకు వెసులుబాటు వాతావరణం కల్పించాలని భావిస్తోంది. దీనికి జపాన్ భాషా శిక్షణ తీసుకున్న వారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో జపనీస్ నేర్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచార సలహాదారుడు పరకాల ప్రభాకర్ పీటీఐతో తెలిపారు. జపాన్ కంపెనీలతో పనిచేసేందుకు వీలుగా జపాన్, తెలుగు, ఇంగ్లీష్ భాషలు తెలిసినవారు చాలా అవసరమని, భవిష్యత్తులో జపనీస్ తెలిసినవారికి మరింత డిమాండ్ పెరగనుందని ప్రభాకర్ పేర్కొన్నారు. -
'అప్పుడు వచ్చిన పెట్టుబడులు రెండు శాతమే'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మినీ జపాన్ ఏర్పాటు చేయడానికి జపాన్ కంపెనీలు సిద్ధం అవుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు కొన్ని పత్రికల్లో రాయించుకుంటున్నారంటూ వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు 9ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు వేల కోట్లు పెట్టుబడులు వస్తాయన్నా.. వచ్చింది కేవలం 2శాతం పెట్టుబడులేనని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం చెప్పేది కొండంత.. చేసేది గోరంత అని చెప్పారు. చంద్రబాబుకు విదేశీ పారిశ్రామిక వేత్తలంటే ఎందుకంత మోజు.. మన పారిశ్రామికవేత్తలంటే ఎందుకంత చిన్నచూపు అంటూ దుయ్యబట్టారు. విదేశీయులతో రహస్య ఒప్పందాలు ఏమైనా చేసుకుంటున్నారా ? అంటూ అంబటి ఘాటుగా ప్రశ్నించారు. జపాన్‌లో భూకంపాలు వస్తూంటాయి.. ఇక్కడ కూడా భూకంపాలు తీసుకొస్తుంటారా ? అంటూ అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. -
డోరేమాన్ కార్టూన్లు.. పిల్లల చానళ్లు!
న్యూఢిల్లీ: న్యూస్ చానళ్లను మించే వ్యూయర్షిప్ .. పెద్దలను కూడా కూర్చోబెట్టేసే ప్రోగ్రామ్‌లు.. ఇలాంటివన్నీ చూసి ప్రస్తుతం చిన్న పిల్లల చానల్స్ బాట పడుతున్నాయి జపాన్ కంపెనీలు. మిగతా చానళ్లకు దీటుగా ప్రకటనలపై భారీగా వెచ్చిస్తున్నాయి. పిల్లల ద్వారా తల్లిదండ్రులతో తమ ఉత్పత్తులను కొనిపించేలా ప్రోత్సహిస్తున్నాయి. డోరేమాన్, హెలో కిట్టీ, నింజా వారియర్స్.. ఇలాంటి జపానీస్ కార్టూన్లు, క్యారెక్టర్ల గురించి ప్రస్తుతం పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా టకటకా చెప్పేస్తున్నారు. జపాన్‌కే చెందిన ప్యానాసోనిక్, టయోటా లాంటి ప్రముఖ కంపెనీల గురించైనా తెలియకపోవచ్చునేమో గానీ ఈ కార్టూన్ క్యారెక్టర్లు మాత్రం భారత్‌లో బాగా పాపులర్ అయిపోయాయంటే అతిశయోక్తి కాదు. ఒక రకంగా చెప్పాలంటే.. మిక్కీ మౌజ్, డొనాల్డ్ డక్ లాంటి పాశ్చాత్య కార్టూన్ల ఆధిపత్యానికి డోరేమాన్ వంటి జపాన్ కార్టూన్లు కొంత మేర గండికొట్టగలిగాయి. వీటి కారణంగా పిల్లలతో పాటు తల్లిదండ్రులు సైతం కార్టూన్ చానళ్లను చూడటానికి అలవాటుపడిపోతున్నారు. దీంతో జపాన్ అంటే అత్యుత్తమమైనవి మాత్రమే తయారు చేస్తుందన్న భావన పిల్లల్లోనూ పెరుగుతుందని, తద్వారా తమ వ్యాపారాలూ మరింత మెరుగుపడతాయని జపానీస్ కంపెనీలు భావిస్తున్నాయి. పెద్దల దృష్టిని ఆకర్షించేందుకు పెద్ద పెద్ద జపాన్ కంపెనీలు ప్రస్తుతం చిన్న పిల్లల కార్టూన్ చానళ్ల వైపు మళ్లుతున్నాయి. సోనీ నుంచి శాంసంగ్ దాకా... పిల్లల చానళ్లకి ఉన్న శక్తిని గుర్తించి.. జపాన్ కంపెనీలతో పాటు ఇతర సంస్థలు సైతం కార్టూన్లపై ఆధారపడుతున్నాయి. సోనీ లాంటి వాటితో పాటు కెమెరాలు, సంబంధిత పరికరాలు తయారు చేసే కెనాన్ మొదలైన దిగ్గజాలు పిల్లల చానళ్లలో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. డోరేమాన్, హెలో కిట్టీ లాంటి కార్టూన్ క్యారెక్టర్లతో సోనీ కంప్యూటర్స్ గేమింగ్ కన్సోల్స్, సాఫ్ట్వేర్ వంటి ఉత్పత్తుల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈ పరిణామాలతో మారుతీ సుజుకీ, హోండా, గ్లాక్సోస్మిత్‌క్లెయిన్, హిందుస్తాన్ యూనిలీవర్, శాంసంగ్ తదితర సంస్థలు సైతం తమ విక్రయాలను మెరుగుపర్చుకునేందుకు డోరేమాన్ వంటి కార్టూన్ క్యారెక్టర్ల సాయం తీసుకుంటున్నాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. గణాంకాలు చెబుతున్నాయ్.. దాదాపు 75 శాతం మంది తల్లిదండ్రులు వారంలో కనీసం అయిదారు సార్లయినా పిల్లలతో కలిసి టీవీ చూస్తారని కార్టూన్ నెట్వర్క్ కొన్నాళ్ల క్రితం నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కాస్త పెద్ద పిల్లలతో కలిసి టీవీ చూసే వారి విషయానికొస్తే 80 శాతం దాకా ఉన్నారు. ఈ విభాగం ఇంత భారీగా పెరుగుతున్నప్పటికీ.. దీని ప్రయోజనాలను కంపెనీలు పూర్తిగా వినియోగించుకోవడం లేదని చానల్స్ అంటున్నాయి. వ్యూయర్షిప్ ఏడు శాతం స్థాయిలో ఉన్నా.. మొత్తం ఆదాయాల్లో వీటి వాటా మూడు శాతం మాత్రమే ఉంటోందంటున్నాయి. న్యూస్ చానళ్లను మించిన వ్యూయర్ షిప్ ఉంటుండటంతో అడ్వర్టైజర్లు ప్రస్తుతం పిల్లల చానళ్ల వైపు దృష్టి సారిస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.