యంగ్ పికాసో!
జార్జ్ పొచెస్తోవ్ పదకొండు నెలల వయసులో ఉన్నప్పుడు వాళ్ల నాన్న బ్రెయిన్ కాన్సర్‌తో చనిపోయాడు. చావు గురించి జార్జ్‌కు తెలిసే వయసేమీ కాదు అది. కానీ, ఆ చిట్టి కళ్లు తండ్రి కోసం వెదుకుతున్నట్లు తల్లి కనిపెట్టింది. పిల్లాడిని దారి మళ్లించడానికి అన్నట్లు అతని ముందు పెయింటింగ్ సామాగ్రి ముందు పెట్టేది. వాటితో తనకు తోచిన గీతలేవో గీసేవాడు జార్జ్.
అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉక్రెయిన్ దంపతులకు జన్మించిన జార్జ్ పదిహేడు సంవత్సరాల వయసులో కారు బొమ్మను అద్భుతంగా గీశాడు. వయసుతో పాటు అతనిలో చిత్రకళా ప్రతిభ పెరగడం ప్రారంభమైంది. బ్రైట్ కలర్ స్కీమ్‌లతో రకరకాల ప్రయోగాలు చేశాడు.
గురువంటూ ఎవరూ లేకపోయినా చిత్రకళను తనకు తానే స్వయంగా నేర్చుకున్నాడు. జార్జ్ గీసిన చిత్రాలకు బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది. త్రీ-డైమన్షల్ కాన్వాస్ మీద దృష్టి పెట్టినా, ఇ్రంపెషనిస్టిక్ ఆర్ట్ మీద దృష్టి పెట్టినా...తనదైన శైలిని ఎప్పుడు కోల్పోలేదు జార్జ్.
హిల్లరీ క్లింటన్ నుంచి మైఖెల్ జోర్డన్(ప్రముఖ బాస్కెట్‌బాల్ ప్లేయర్) వరకు జార్జ్‌కు అభిమానులు ఉన్నారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్, కొరియా, దక్షిణ అమెరికా, నెదర్‌లాండ్స్, రష్యా, ఉక్రేయిన్‌లలో ఎక్కువగా జార్జ్ చిత్రాలు ప్రదర్శితమవుతుంటాయి.
జార్జ్‌పై ‘ఏ బ్రష్ విత్ డెస్టినీ’ అనే డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంది. ఇది నాలుగు ఎమ్మీ అవార్డ్‌లు గెలుచుకుంది. చిత్రకళ మాత్రమే కాకుండా సామాజిక సేవా సంస్థలకు సహాయపడడం అంటే కూడా జార్జ్‌కు ఎంతో ఇష్టమైన పని.
ఇరవెరైండు సంవత్సరాల జార్జ్ పొచెస్తోవ్‌ను మీడియా ముద్దుగా ‘యంగ్ పికాసో’ అని పిలుస్తుంది.
నిజానికది భారీ పొగడ్తే కావచ్చు, కానీ చిత్రకళలో జార్జ్ మెరుపులు చూస్తుంటే ఆ మాత్రమైనా అనకుంటే ఎలా అనిపిస్తుంది!
జార్జ్‌పై ‘ఏ బ్రష్ విత్ డెస్టినీ’ అనే డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంది. ఇది నాలుగు ఎమ్మీ అవార్డ్‌లు గెలుచుకుంది. చిత్రకళ మాత్రమే కాకుండా సామాజిక సేవా సంస్థలకు సహాయపడడం అంటే కూడా జార్జ్‌కు ఎంతో ఇష్టమైన పని.