the Netherlands
-
అరటిపళ్లు అంతరించనున్నాయా..?
పరిపరి శోధన విరివిగా కనిపించే అరటిపళ్లు అంతరించిపోనున్నాయా..? ఆశ్చర్యంగా ఉంది కదూ! అయినా, ఔననే అంటున్నారు నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు. ‘ఫుసారియమ్ ఆక్సిస్పోరమ్’ అనే ఒకరకమైన ఫంగస్ వల్ల వ్యాపించే ‘పనామా వ్యాధి’ విజృంభిస్తోందని, ఇది సోకితే అరటిచెట్లు నాశనం కావడం తథ్యమని నెదర్లాండ్స్‌కు చెందిన వేజెనింజెన్ వర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తైవాన్, ఇండోనేసియా, మలేసియాలలో ఇప్పటికే ‘పనామా వ్యాధి’ అరటి పంటను దారుణంగా నాశనం చేసిందని వారు చెబుతున్నారు. పాశ్చాత్య దేశాలకు అరటిపళ్లను ఎగుమతి చేసే లాటిన్ అమెరికా దేశాలకు విస్తరించక ముందే ఈ వ్యాధిని అరికట్టకుంటే, అరటిపళ్లు అంతరించే ప్రమాదం తప్పకపోవచ్చని అంటున్నారు. -
రోబోలతో పెళ్లిళ్లు జరుగుతాయట!
పరిపరి శోధన ఇదేమీ బ్రహ్మంగారి కాలజ్ఞానం కాదు గానీ, నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిష్ట్ వర్సిటీకి చెందిన డేవిడ్ లెవీ అనే పరిశోధకుడు ఇదే మాట చెబుతున్నాడు. భవిష్యత్తులో మనుషులు రోబోలను పెళ్లాడుతారని, 2050 నాటికి చాలా దేశాలు రోబోలతో పెళ్లిళ్లను చట్టబద్ధం కూడా చేస్తాయని అంటున్నాడు. ప్రపంచంలో అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రమే రోబోలతో పెళ్లిళ్లను చట్టబద్ధం చేసే తొలి రాష్ట్రమవుతుందని కూడా చెబుతున్నాడు. ఇతగాడు ఇటీవలే ‘రోబోలూ-మానవ సంబంధాలు’ అనే అంశంపై పరిశోధన పూర్తిచేసి, పీహెచ్డీ కూడా పొందాడు. అలాగే, భవిష్యత్తులో రోబోల ప్రేమ కథలు, శృంగార కథలు సాహిత్యాన్ని ఏలుతాయని కూడా ఈ అధునికానంతర కాలజ్ఞాని సెలవిస్తున్నాడు. -
ఇయం వార్తా శ్రూయంతాం
ప్రపంచం నెదర్లాండ్స్‌లో ఒక కంపెనీ బుల్లెట్-ప్రూఫ్ బట్టల దుకాణాన్ని ప్రారంభించింది. ఇందులో బుల్లెట్-ప్రూఫ్ టైతో సహా టీషర్ట్‌ల వరకు అమ్ముతారు. ఇవి నేరస్థుల కోసం మాత్రం కాదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది అయిదుమంది సహచర సైనికులను కాల్చి వేసిన కేసులో దక్షిణ కొరియా సైనికుడు లిమ్‌కు మిల్ట్రీ కోర్టు మరణశిక్ష విధించింది క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో తాజా చిత్రాలను క్యూబన్ స్టేట్ మీడియా విడుదల చేసింది. ఆయన ఆరోగ్యంపై వచ్చిన పుకార్లకు ఈ ఫోటోలు సమాధానం చెబుతాయని అధికారులు చెబుతున్నారు. బంగ్లాదేశ్‌లో ఒక బస్సుపై జరిగిన పెట్రోల్ బాంబు దాడిలో 15 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు ప్రఖ్యాత సింగర్ విట్నీ హస్టన్ కూతురు బాబీ క్రిస్టినా కోమలోకి వెళ్లిపోయారు. ఆమె వయసు 21 సంవత్సరాలు. -
భారత హాకీ జట్టు కొత్త కోచ్‌గా పాల్ వాన్ యాస్
న్యూఢిల్లీ: భారత పురుషుల హాకీ జట్టు కొత్త కోచ్‌గా నెదర్లాండ్స్ మాజీ కోచ్ పాల్ వాన్ యాస్‌ను... మహిళల టీమ్‌కు ఆంథోని థోర్న్టన్ (న్యూజిలాండ్)ను ఎంపిక చేశారు. టెర్రీ వాల్ష్, నీల్ హావ్‌గుడ్ స్థానంలో ఈ ఇద్దరు బాధ్యతలు తీసుకుంటారు. మూడేళ్ల పాటు (2018) ఈ ఇద్దరు కాంట్రాక్ట్‌లో ఉండనున్నారు. ఆటగాడిగా వాన్ యాస్‌కు అంతర్జాతీయ అనుభవం తక్కువగా ఉన్నా... కోచ్‌గా నెదర్లాండ్స్ జట్టుకు లండన్ ఒలింపిక్స్‌లో రజతం అందించారు. ఇక నాలుగేళ్ల నుంచి ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ ఇనిస్టిట్యూట్‌లో పనిచేస్తున్న థోర్న్టన్ బార్సిలోనా ఒలింపిక్స్‌లో న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు...
నెదర్లాండ్స్‌పై భారత్ సంచలన విజయం 18 ఏళ్ల తర్వాత తొలి గెలుపు రేపు క్వార్టర్స్‌లో బెల్జియంతో ‘ఢీ’ చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ భువనేశ్వర్: తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన కసినంతా నెదర్లాండ్స్‌పై తీర్చుకున్న భారత జట్టు సంచలనం సృష్టించింది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ప్రపంచ రెండో ర్యాంకర్ నెదర్లాండ్స్‌తో మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 3-2 గోల్స్ తేడాతో అద్వితీయ విజయం సాధించింది. నెదర్లాండ్స్‌పై 18 ఏళ్ల తర్వాత టీమిండియా తొలిసారి నెగ్గింది. భారత్ తరఫున సునీల్ (33వ నిమిషంలో), మన్‌ప్రీత్ సింగ్ (47వ నిమిషంలో), రూపిందర్ సింగ్ (49వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... నెదర్లాండ్స్ జట్టుకు వాన్ డెర్ వీర్డెన్ మింక్ (36వ, 58వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించాడు.మన్‌ప్రీత్ సింగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. చివరిసారి 1996లో ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో నెదర్లాండ్స్‌ను ఓడించిన భారత్... చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఆ జట్టుపై 1986 తర్వాత తొలిసారి గెలిచింది. నెదర్లాండ్స్‌పై విజయంతో భారత్ గ్రూప్ ‘బి’లో మూడు పాయింట్లతో జర్మనీతో సమఉజ్జీగా నిలిచింది. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా ఈ గ్రూప్‌లో భారత్‌కు మూడో స్థానం (-2 గోల్స్) దక్కగా... జర్మనీ (-5 గోల్స్) నాలుగో స్థానంలో నిలిచింది. మంగళవారం జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో అర్జెంటీనా 3-0తో జర్మనీపై; ఆస్ట్రేలియా 3-0తో పాకిస్తాన్‌పై గెలుపొందగా... ఇంగ్లండ్, బెల్జియం జట్ల మధ్య మ్యాచ్ 1-1 వద్ద ‘డ్రా’గా ముగిసింది. -
యంగ్ పికాసో!
జార్జ్ పొచెస్తోవ్ పదకొండు నెలల వయసులో ఉన్నప్పుడు వాళ్ల నాన్న బ్రెయిన్ కాన్సర్‌తో చనిపోయాడు. చావు గురించి జార్జ్‌కు తెలిసే వయసేమీ కాదు అది. కానీ, ఆ చిట్టి కళ్లు తండ్రి కోసం వెదుకుతున్నట్లు తల్లి కనిపెట్టింది. పిల్లాడిని దారి మళ్లించడానికి అన్నట్లు అతని ముందు పెయింటింగ్ సామాగ్రి ముందు పెట్టేది. వాటితో తనకు తోచిన గీతలేవో గీసేవాడు జార్జ్. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉక్రెయిన్ దంపతులకు జన్మించిన జార్జ్ పదిహేడు సంవత్సరాల వయసులో కారు బొమ్మను అద్భుతంగా గీశాడు. వయసుతో పాటు అతనిలో చిత్రకళా ప్రతిభ పెరగడం ప్రారంభమైంది. బ్రైట్ కలర్ స్కీమ్‌లతో రకరకాల ప్రయోగాలు చేశాడు. గురువంటూ ఎవరూ లేకపోయినా చిత్రకళను తనకు తానే స్వయంగా నేర్చుకున్నాడు. జార్జ్ గీసిన చిత్రాలకు బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది. త్రీ-డైమన్షల్ కాన్వాస్ మీద దృష్టి పెట్టినా, ఇ్రంపెషనిస్టిక్ ఆర్ట్ మీద దృష్టి పెట్టినా...తనదైన శైలిని ఎప్పుడు కోల్పోలేదు జార్జ్. హిల్లరీ క్లింటన్ నుంచి మైఖెల్ జోర్డన్(ప్రముఖ బాస్కెట్‌బాల్ ప్లేయర్) వరకు జార్జ్‌కు అభిమానులు ఉన్నారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్, కొరియా, దక్షిణ అమెరికా, నెదర్లాండ్స్, రష్యా, ఉక్రేయిన్లలో ఎక్కువగా జార్జ్ చిత్రాలు ప్రదర్శితమవుతుంటాయి. జార్జ్‌పై ‘ఏ బ్రష్ విత్ డెస్టినీ’ అనే డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంది. ఇది నాలుగు ఎమ్మీ అవార్డ్లు గెలుచుకుంది. చిత్రకళ మాత్రమే కాకుండా సామాజిక సేవా సంస్థలకు సహాయపడడం అంటే కూడా జార్జ్‌కు ఎంతో ఇష్టమైన పని. ఇరవెరైండు సంవత్సరాల జార్జ్ పొచెస్తోవ్ను మీడియా ముద్దుగా ‘యంగ్ పికాసో’ అని పిలుస్తుంది. నిజానికది భారీ పొగడ్తే కావచ్చు, కానీ చిత్రకళలో జార్జ్ మెరుపులు చూస్తుంటే ఆ మాత్రమైనా అనకుంటే ఎలా అనిపిస్తుంది! జార్జ్‌పై ‘ఏ బ్రష్ విత్ డెస్టినీ’ అనే డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంది. ఇది నాలుగు ఎమ్మీ అవార్డ్లు గెలుచుకుంది. చిత్రకళ మాత్రమే కాకుండా సామాజిక సేవా సంస్థలకు సహాయపడడం అంటే కూడా జార్జ్‌కు ఎంతో ఇష్టమైన పని.