అరటిపళ్లు అంతరించనున్నాయా..? | close the banana life fruit ..? | Sakshi
Sakshi News home page

అరటిపళ్లు అంతరించనున్నాయా..?

Published Wed, Dec 2 2015 11:17 PM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM

అరటిపళ్లు అంతరించనున్నాయా..?

అరటిపళ్లు అంతరించనున్నాయా..?

పరిపరి శోధన
 
విరివిగా కనిపించే అరటిపళ్లు అంతరించిపోనున్నాయా..? ఆశ్చర్యంగా ఉంది కదూ! అయినా, ఔననే అంటున్నారు నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు. ‘ఫుసారియమ్ ఆక్సిస్పోరమ్’ అనే ఒకరకమైన ఫంగస్ వల్ల వ్యాపించే ‘పనామా వ్యాధి’ విజృంభిస్తోందని, ఇది సోకితే అరటిచెట్లు నాశనం కావడం తథ్యమని నెదర్లాండ్స్‌కు చెందిన వేజెనింజెన్ వర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

తైవాన్, ఇండోనేసియా, మలేసియాలలో ఇప్పటికే ‘పనామా వ్యాధి’ అరటి పంటను దారుణంగా నాశనం చేసిందని వారు చెబుతున్నారు. పాశ్చాత్య దేశాలకు అరటిపళ్లను ఎగుమతి చేసే లాటిన్ అమెరికా దేశాలకు విస్తరించక ముందే ఈ వ్యాధిని అరికట్టకుంటే, అరటిపళ్లు అంతరించే ప్రమాదం తప్పకపోవచ్చని అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement