ఇన్‌ఫ్రా అభివృద్ధికి భారత్–కొరియా ఒప్పందాలు
న్యూఢిల్లీ/సియోల్: మౌలిక సదుపాయాల అభివృద్ధి, ద్వైపాక్షిక వాణిజ్య బలోపేతానికి సంబంధించి భారత్, కొరియాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. సియోల్‌లో జరిగిన ఐదవ ఇండియా–కొరియా ఆర్థిక సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, దక్షిణ కొరియా ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి కిమ్ డాంగ్–యెన్‌లు పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా తాజా ఒప్పందాలు జరిగాయి. భారత్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల అభివృద్ధికి 1 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం, 9 బిలియన్ డాలర్ల రాయితీతో కూడిన రుణాలు అందించేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి.