![Indian Junior Womens Hockey Team Beat New Zealand - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/8/IN.jpg.webp?itok=cXz4d1tt)
కాన్‌బెర్రా (ఆ్రస్టేలియా): మూడు దేశాల జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు అజేయ రికార్డు కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–1 గోల్స్ తేడాతో నెగ్గింది. ఈ టోర్నీ లో భారత్‌కిది రెండో విజయం కాగా... మరో మ్యాచ్ ‘డ్రా’ అయింది. నేడు ఆ్రస్టేలియాతో భారత్ తలపడుతుంది. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత అమ్మాయిలు ఆద్యంతం ఆధిపత్యం చలాయించారు. ప్రతి క్వార్టర్‌లో ఒక్కో గోల్ చేశారు. భారత్ తరఫున షర్మిలా దేవి (12వ, 43వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... డుంగ్‌డుంగ్ బ్యూటీ (27వ ని.లో), లాల్‌రిన్‌డికి (48వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. కివీస్ తరఫున షానన్ ఒలివియా (4వ ని.లో) ఏకైక గోల్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment