ఇఫో: తొలి మ్యాచ్‌లో జపాన్‌పై కష్టపడి గెలిచిన భారత్ జట్టు సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్ రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 1-5తో చిత్తుగా ఓడిపోయింది. ఆసీస్... ఆట 5వ నిమిషంలో బ్లేక్ గోవర్స్ చేసిన గోల్‌తో ఖాతా తెరిచింది. అయితే కాసేపటికే భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్ సింగ్(8వ ని.) గోల్‌గా మలచడంతో స్కోరు 1-1తో సమమైంది.
13వ నిమిషంలో రక్షణ పంక్తిని ఛేదిస్తూ ఆస్ట్రేలియా కెప్టెన్ జామీ డ్వేర్ ఇచ్చిన పాస్‌ను వెట్టన్ గోల్‌గా మలిచాడు. దీంతో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం ఎడ్డీ వొకెండెన్ (20వ ని.), సిమన్ ఆర్చడ్ (25వ ని.) చెరో గోల్ చేయడంతో తొలి అర్ధభాగాన్ని 4-1తో ముగించింది. ద్వితీయార్థంలో మ్యాట్ గోడ్స్ (53వ ని.) చేసిన గోల్‌తో ఆసీస్ ఘనవిజయం సాధించింది.
అజ్లాన్ షా కప్: ఆసీస్ చేతిలో భారత్ ఓటమి
Published Fri, Apr 8 2016 1:21 AM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM
Advertisement
Advertisement