హాకీ టోర్నీలో ఫైనల్‌కు ‘అనంత’జట్టు
ధర్మవరంటౌన్ : విశాఖపట్నంలోని ఎలమంచిలిలో జరుగుతున్న ఏపీ 7వ జూనియర్ బాలుర హాకీ ఇంటర్ డిస్ట్రిక్ టోర్నీలో అనంత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం సెమీఫైనల్‌లో జరిగిన పోరులో అనంత జట్టు గుంటూరు జట్టుతో తలపడింది. ఈ పోటీల్లో అనంతజట్టు 3–1తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. అనంత జట్టులో క్రీడాకారులు భానుప్రకాష్‌రెడ్డి–1, శివ–1, మహబూబ్‌బాష–1 గోల్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మంగâýæవారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో అనంతజట్టు, వైజాగ్ జట్టుతో తలపడనుంది. ప్రతిభ కనబరిచిన అనంత జట్టు క్రీడాకారులను జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు మాంచూఫెర్రర్, ధర్మాంబ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లెం వేణుగోపాల్, బీవీఆర్ శ్రీనివాసులు, పరిశీలకుడు వడ్డే బాలాజీ అభినందించారు.