నేడు దాయాదుల సమరం
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ
మధ్యాహ్నం గం. 1:15 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
హులున్‌బుయిర్ (చైనా): ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నేడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత భారత్ ఈ టోర్నీలో నాలుగు వరుస విజయాలతో ఇప్పటికే సెమీఫైనల్ బెర్తు సాధించింది. టీమిండియా 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉండగా... నాలుగింట రెండు మ్యాచ్‌లు గెలిచిన పాకిస్తాన్ 8 పాయింట్లతో సెమీఫైనల్‌కు అర్హత సంపాదించింది.
ఈ నేపథ్యంలో ఇరుజట్లకు ఇది నామమాత్రమైన పోరే అయినప్పటికీ మైదానంలో జరిగే సమరం మాత్రం హైవోల్టేజీతో ఉంటుంది. భారత కెపె్టన్ సహా ఆటగాళ్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. పారిస్ పతకం ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పటివరకు ఎదురైన అన్ని జట్లను మట్టికరిపించారు. ఆతిథ్య చైనాను 3–0తో చిత్తు చేసిన భారత్ 5–1తో జపాన్‌పై, 8–1తో మలేసియాపై తిరుగులేని విజయాలు సాధించింది.
3–1తో కొరియాను ఓడించిన భారత్ ఇప్పుడు ఇదే జోరుతో దాయాది జట్టును కంగుతినిపించాలని తహతహలాడుతోంది. గతేడాది చైనాలోనే జరిగే హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత్ 10–2తో పాకిస్తాన్‌పై ఏకపక్ష విజయాన్ని సాధించింది. గత ఏడాది చెన్నైలో జరిగిన పోరులోనూ భారత్ 4–0తో ఘనవిజయం సాధించింది. టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన దుర్భేధ్యమైన టీమిండియాను ఓడించడం పాకిస్తాన్‌కు అంత సులభం కాదు.
ప్రపంచంలోనే ఉత్తమ డ్రాగ్‌ఫ్లికర్‌లలో ఒకడైన కెపె్టన్ హర్మన్‌ప్రీత్ చిరకాల ప్రత్యరి్థతో మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. ఇప్పుడున్న పాక్ జట్టులోని ఆటగాళ్లను జూనియర్ స్థాయి నుంచే ఎదుర్కొన్న అనుభవం తనకుందని చెప్పాడు. దీంతో వారితో చక్కని అనుబంధం ఏర్పడిందని, సోదరభావంతో మెలుగుతామని అన్నాడు. అయితే మైదానంలోకి దిగగానే ప్రత్యర్థులపై చెలరేగేందుకు సై అంటామని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment