
హామిల్టన్: నాలుగు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్ రెండో అంచెలో భారత్ శుభారంభం చేసింది. తొలి అంచె ఫైనల్లో బెల్జియం చేతిలో ఓటమి పాలైన భారత్... బుధవారం రెండో అంచె తొలి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ పై 3–2తో విజయం సాధించింది. మన జట్టు తరఫున లలిత్ ఉపాధ్యాయ్ (7వ ని.లో), హర్జీత్ సింగ్ (32వ ని.లో), రూపిందర్ పాల్ సింగ్ (36వ ని.లో) తలా ఓ గోల్ నమోదు చేశారు.