తౌరంగ (న్యూజిలాండ్): నాలుగు దేశాల అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. జపాన్‌తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 6–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున దిల్‌ప్రీత్ (35వ, 45వ ని.లో)... వివేక్ (12వ, 28వ ని.లో) రెండేసి గోల్స్ చేయగా... రూపిందర్ పాల్ సింగ్ (7వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (41వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. గురువారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో బెల్జియంతో భారత్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment