Semifinal berth
-
ఎదురులేని భారత్
చెన్నై: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో ఎదురేలేని భారత్ మూడో విజయాన్ని సాధించి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సోమవారం జరిగిన పోరులో టీమిండియా 3–2 గోల్స్‌తో దక్షిణ కొరియాపై గెలుపొందింది. భారత్ తరఫున నీలకంఠ శర్మ (6వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (23వ ని.లో), మన్దీప్ సింగ్ (33వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. కొరియా బృందంలో సంగ్‌హ్యూన్ కిమ్ (12వ ని.లో), జిహున్ యంగ్ (58వ ని.లో) చెరో గోల్ చేశారు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో భారత్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రేపు తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ 2–1తో చైనాపై గెలుపొంది సెమీస్ ఆశల్ని నిలబెట్టుకుంది. మరోవైపు మలేసియా 3–1తో జపాన్ను ఓడించి సెమీఫైనల్‌కు అర్హత సంపాదించింది. -
T20 World Cup 2022: దర్జాగా సెమీస్‌కు...
గత ఏడాది టి20 వరల్డ్‌కప్‌లో లీగ్ దశలోనే ఇంటికొచ్చిన భారత్ ఈసారి టోర్నీలో లీగ్ టాపర్‌గా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. టీమిండియా చిన్న జట్లను తేలిగ్గా తీసుకోలేదు. పెద్ద జట్లతో గాభరా పడలేదు. ప్రతీ పోరు విలువైందన్నట్లుగానే ఆడింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ మినహా ప్రతి మ్యాచ్‌లోనూ బ్యాటర్లు, బౌలర్లు చక్కగా రాణించారు. సమష్టి బాధ్యత కనబరిచారు. దీంతో టీమిండియా ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా మారింది. గురువారం అడిలైడ్‌లో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో రోహిత్ శర్మ బృందం సమరానికి సై అంటోంది. మెల్బోర్న్: సూర్యకుమార్ యాదవ్‌ను సహచరులంతా అతని పేరులోని మూడక్షరాలతో స్కై (ఎస్కేవై) అంటారు. ఈ ప్రపంచకప్‌లో అతను కూడా ఆ పేరుకు (ఆకాశం) తగ్గట్లే హద్దేలేని ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపిస్తున్నాడు. అభిమానుల్ని అలరిస్తున్నాడు. జింబాబ్వేతో పోరులో అయితే ‘సూపర్ సండే’ స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్య (25 బంతుల్లో 61; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపుల సునామీతో... ‘సూపర్ 12’ గ్రూప్–2 చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 71 పరుగుల తేడాతో జింబాబ్వేపై జయభేరి మోగించి 8 పాయింట్లతో ‘టాపర్’గా నిలిచింది. మొదట భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా మెరిపించాడు. సీన్ విలియమ్స్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. బర్ల్ (22 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), రజా (24 బంతుల్లో 34; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. అశ్విన్ (3/22), షమీ (2/14), హార్దిక్ పాండ్యా (2/16) ప్రత్యర్థిని మూకుమ్మడిగా దెబ్బకొట్టారు. సూర్య ప్రతాపం... ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్లో ‘భారత 360’ సూర్య బ్యాటింగ్ ఓ లెవెల్లో వుంది. ఈ మ్యాచ్‌లో అది మరో స్థాయికి చేరింది. సూర్య 12 ఓవర్ ఆఖరిబంతికి క్రీజులోకి వచ్చాడు. అప్పుడు టీమిండియా స్కోరు (87/2) వందయినా కాలేదు. అతను రాగానే రాహుల్ అవుటయ్యాడు. అవకాశమిచ్చిన రిషభ్ పంత్ (3) చేజార్చుకున్నాడు. స్కోరు 101/4గా ఉన్న దశలో జింబాబ్వే సంచలనంపై ఆశలు పెట్టుకోకుండా సూర్యకుమార్ రెచ్చిపోయాడు. కొన్నిషాట్లయితే ఊహకే అందవు. ఆఫ్‌సైడ్‌కు దూరంగా వెళుతున్న బంతుల్ని ఆన్‌సైడ్‌లో సిక్సర్లుగా మలచడం అద్భుతం. 15 ఓవర్లలో 107/4గా ఉన్న స్కోరు అతని సునామీ ఇన్నింగ్స్‌తో 186/5గా మ్యాచ్ ఛేంజింగ్ ఫిగర్ అయ్యింది. ఆఖరి 5 ఓవర్లలో 79 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్లో సూర్య వరుసగా 2 బౌండరీలు కొడితే పాండ్యా మరో ఫోర్ కొట్టాడు. 17వ ఓవర్ వేసిన ఎన్గరవా ఆఫ్‌సైడ్‌లో వేసిన వైడ్ యార్కర్లను 4, 6గా కొట్టడం మ్యాచ్‌కే హైలైట్. చటారా ఓవర్లో ఎక్స్ట్రా కవర్స్ మీదుగా బాదిన సిక్సర్, ఎన్‌గరవ ఆఖరి ఓవర్లో వరుసగా సూర్య 6, 2, 4, 6లతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. 23 బంతుల్లో సూర్య (5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫిఫ్టీ పూర్తయ్యింది. అంతకుముందు ఓపెనర్లలో రోహిత్ (15) విఫలమైనా... రాహుల్, కోహ్లి (25 బంతుల్లో 26; 2 ఫోర్లు)తో కలిసి స్కోరును నడిపించాడు. 34 బంతుల్లో (3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాహుల్ అర్ధశతకం సాధించాడు. మన పేస్‌కు విలవిల జింబాబ్వే బ్యాటర్లు లక్ష్యఛేదనను అటుంచి... అసలు క్రీజులో నిలిచేందుకే కష్టపడ్డారు. టాప్, మిడిలార్డర్ భారత పేస్ బౌలింగ్‌కు విలవిల్లాడింది. ఓపెనర్లు మదెవెర్ (0)ను భువీ, ఇర్విన్ (13)ను హార్దిక్, చకబ్వా (0)ను అర్‡్షదీప్, సీన్ విలియమ్స్ (11)ను షమీ... ఇలా వరుసలోని నలుగురు బ్యాటర్స్‌ను నలుగురు బౌలర్లు దెబ్బకొట్టడంతో జింబాబ్వే ఓటమివైపు నడిచింది. సికిందర్ రజా, రియాన్ బర్ల్ చేసిన పరుగులు జట్టు వంద దాటేందుకు ఉపయోగపడ్డాయి. ఆఖరి వరుస బ్యాటర్స్ అశ్విన్ ఉచ్చులో పడటంతో ఆలౌట్ అయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) మసకద్జా (బి) సికందర్ 51; రోహిత్ (సి) మసకద్జా (బి) ముజరబాని 15; కోహ్లి (సి) బర్ల్ (బి) విలియమ్స్ 26; సూర్యకుమార్ (నాటౌట్) 61; పంత్ (సి) బర్ల్ (బి) విలియమ్స్ 3; పాండ్యా (సి) ముజరబాని (బి) ఎన్‌గరవ 18; అక్షర్ పటేల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–27, 2–87, 3–95, 4–101, 5–166. బౌలింగ్: ఎన్‌గరవ 4–1–44–1, చటార 4–0–34–0, ముజరబాని 4–0–50–1, మసకద్జా 2–0–12–0, బర్ల్ 1–0–14–0, సికందర్ రజా 3–0–18–1, సీన్ విలియమ్స్ 2–0–9–2. జింబాబ్వే ఇన్నింగ్స్: మదెవెర్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 0; ఇర్విన్ (సి అండ్ బి) పాండ్యా 13; చకబ్వా (బి) అర్‡్షదీప్ 0; విలియమ్స్ (సి) భువనేశ్వర్ (బి) 11; సికందర్ (సి) సూర్య (బి) పాండ్యా 34; టోని (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 5; బర్ల్ (బి) అశ్విన్ 35; మసకద్జా (సి) రోహిత్ (బి) అశ్విన్ 1; ఎన్‌గరవ (బి) అశ్విన్ 1; చటార (సి అండ్ బి) అక్షర్ 4; ముజరబాని (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (17.2 ఓవర్లలో ఆలౌట్) 115. వికెట్ల పతనం: 1–0, 2–2, 3–28, 4–31, 5–36, 6–96, 7–104, 8–106, 9–111, 10– 115. బౌలింగ్: భువనేశ్వర్ 3–1–11–1, అర్‡్షదీప్ 2–0–9–1, షమీ 2–0–14–2, పాండ్యా 3–0– 16–2, అశ్విన్ 4–0–22–3, అక్షర్ 3.2–0–40–1. 1: క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ టి20ల్లో 1,000 పరుగులు సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా సూర్యకుమార్ యాదవ్ గుర్తింపు పొందాడు. ఈ ఏడాది సూర్య 28 టి20 మ్యాచ్‌లు ఆడి 1,026 పరుగులు చేశాడు. 21:ఈ ఏడాది రోహిత్ శర్మ కెప్టెన్సీలో టి20ల్లో భారత్ సాధించిన విజయాలు. క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ (2021లో 20) పేరిట ఉన్న రికార్డును రోహిత్ అధిగమించాడు. -
Wimbledon 2022: నాదల్ అదరహో
లండన్: ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన నాదల్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఎనిమిదోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 36 ఏళ్ల నాదల్ 4 గంటల 21 నిమిషాల్లో 3–6, 7–5, 3–6, 7–5, 7–6 (10/4)తో ‘సూపర్ టైబ్రేక్’లో 11వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై అద్భుత విజయం సాధించాడు. మ్యాచ్ రెండో సెట్లో నాదల్కు పొత్తి కడుపులో నొప్పి రావడంతో మెడికల్ టైమ్అవుట్ తీసుకొని చికిత్స చేయించుకొని ఆటను కొనసాగించాడు. ఆ తర్వాత మొండి పట్టుదలతో ఆడిన నాదల్ చివరకు విజయతీరం చేరాడు. మ్యాచ్ మొత్తంలో ఐదు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు 36 సార్లు దూసుకొచ్చి 26 సార్లు పాయింట్లు గెలిచాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాకు చెందిన నిక్ కిరియోస్తో నాదల్ తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో కిరియోస్ 6–4, 6–3, 7–6 (7/5)తో క్రిస్టియన్ గారిన్ (చిలీ)పై గెలిచి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. హలెప్ జోరు మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో 2019 చాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా) 6–2, 6–4తో అనిసిమోవా (అమెరికా)పై... రిబాకినా (కజకిస్తాన్) 4–6, 6–2, 6–3తో తొమ్లాజనోవిచ్ (ఆస్ట్రేలియా)పై నెగ్గి సెమీస్ చేరారు. మరో క్వార్టర్ ఫైనల్లో ఆన్స్ జబర్ (ట్యూనిషియా) 3–6, 6–1, 6–1తో మేరీ బుజ్ కోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన తొలి అరబ్ ప్లేయర్‌గా నిలిచింది. -
సెమీస్ చేరడం కష్టమే.. కానీ అదొక్కటే దారి
India Still Have Semi-Final Chance T20 WC 2021.. టి20 ప్రపంచకప్ 2021లో టీమిండియా అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించి ఎట్టకేలకు భోణీ కొట్టింది. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో మంచి విజయాన్ని అందుకున్న టీమిండియా నెట్‌రన్‌రేట్‌ను మైనస్ నుంచి ప్లస్‌కు తీసుకొచ్చింది. అయితే రన్‌రేట్ విషయంలో ఇప్పటికీ న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్‌ల కంటే వెనుకబడి ఉంది. టీమిండియాకు సెమీస్ చేరడం కష్టమే అయినప్పటికీ మొత్తం దారులైతే మూసుకుపోలేదు. నవంబరు 5న దుబాయ్ వేదికగా టీమిండియా స్కాట్లాండ్తో తలపడనున్న నేపథ్యంలో ఆ అవకాశాలన్నింటిని ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పటికైతే గ్రూఫ్-1 నుంచి ఇంగ్లండ్, గ్రూఫ్-2 పాకిస్తాన్ సెమీస్‌కు అర్హత సాధించాయి. ఇక మిగిలిన 3,4 స్థానాలకు తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. చదవండి: T20 WC 2021 IND Vs AFG: ఎట్టకేలకు గెలిచాం.. ఆపై నిలిచాం ► టీమిండియా అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించి +0.073 రన్‌రేట్‌తో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. అదే సమయంలో న్యూజిలాండ్ రన్‌రేట్ +.0.816.. అఫ్గానిస్తాన్ రన్‌రేట్ +3.097 నుంచి +1.481 పడిపోయింది. ► టీమిండియా సెమీఫైనల్‌కు వెళ్లాలంటే స్కాట్లాండ్, నమీబియాలతో జరగనున్న మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవాలి.అంతేకాదు అఫ్గానిస్తాన్ లేదా నమీబియాతో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోవాలని కోరుకోవాలి. ప్రాక్టికల్‌గా చూస్తే ఇది సాధ్యం కాకపోవచ్చు.. ఒకవేళ అఫ్గానిస్తాన్ గెలిస్తే మాత్రం టీమిండియాకు అవకాశాలు ఉండొచ్చు. ► న్యూజిలాండ్ అఫ్గానిస్తాన్‌తో పాటు నమీబియాపై గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీస్‌కు చేరుతుంది. టీమిండియా, అఫ్గానిస్తాన్‌లు ఇంటిబాట పడతాయి. ► న్యూజిలాండ్ అఫ్గానిస్తాన్‌తో ఓడి.. నమీబియాతో గెలిస్తే 6 పాయింట్లు ఉంటాయి. ఇక టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధిస్తే 6 పాయింట్లు లభిస్తాయి. అదే సమయంలో అఫ్గానిస్తాన్ కూడా ఆరు పాయింట్లతోనే ఉంటుంది. అప్పుడు నెట్‌రన్‌రేట్ కీలకంగా మారుతుంది. ఆ పరిస్థితి వస్తే టీమిండియా రన్‌రేట్ మెరుగ్గా ఉంటే మాత్రం కచ్చితంగా సెమీస్‌కు చేరుతుంది. చదవండి: NZ Vs SCO: 4, 4, 4, 4, 4, 0.. టి20 ప్రపంచకప్ చరిత్రలో రెండోసారి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సింధు, సాయి చరిత్ర
కల కాదు నిజమే. నమ్మశక్యంకానీ రీతిలో... కళ్లు చెదిరే ప్రదర్శనతో... ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఒకేరోజు ఇద్దరు తెలుగు తేజాలు పూసర్ల వెంకట (పీవీ) సింధు, భమిడిపాటి సాయిప్రణీత్ గర్జించారు. కొన్నేళ్లుగా అంతర్జాతీయ టోర్నీల్లో తనకు కొరకరాని కొయ్యగా మారిన ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్‌ను సింధు మట్టికరిపించగా... ప్రపంచ నాలుగో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీని బోల్తా కొట్టించిన సాయిప్రణీత్ అందరి అంచనాలను తారుమారు చేసి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. సెమీఫైనల్ చేరడంతో సింధు, సాయిప్రణీత్‌లకు కనీసం కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. దాంతో 42 ఏళ్ల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో తొలిసారి భారత్ ఖాతాలో మహిళల సింగిల్స్, పురుషుల సింగిల్స్‌లో పతకాలు చేరనున్నాయి. 1983 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత దిగ్గజ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనే కాంస్యం సాధించాక... పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు మళ్లీ పతకం అందించనున్న ప్లేయర్‌గా సాయిప్రణీత్ చరిత్ర లిఖించాడు. బాసెల్ (స్విట్జర్లాండ్): కొడితే కుంభస్థలం కొట్టాలి. ఈ విషయాన్ని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, సాయిప్రణీత్ నిజం చేసి చూపించారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారులపై అద్వితీయ విజయాలు సాధించారు. ఈ ఏడాది అంతర్జాతీయ టోర్నీల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుల నిరాశాజనక ప్రదర్శనను అందరూ మర్చిపోయేలా చేశారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఐదో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పీవీ సింధు 71 నిమిషాల్లో 12–21, 23–21, 21–19తో రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గగా... పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 19వ ర్యాంకర్, తెలంగాణ ప్లేయర్ సాయిప్రణీత్ 51 నిమిషాల్లో 24–22, 21–14తో నాలుగో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)ను మట్టికరిపించాడు. వెనుకంజలో ఉన్నా... ఈ మ్యాచ్‌కంటే ముందు తై జు యింగ్‌తో ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన సింధు... తొలి గేమ్ తర్వాత ఈసారి కూడా తన ఖాతాలో మరో ఓటమి వేసుకుంటుందనిపించింది. తొలి గేమ్‌ను సులువుగా సమర్పించుకున్న సింధు... రెండో గేమ్‌లో 5–8తో వెనుకంజ లో ఉంది. ఈ కీలక సమయంలో సంయమనం కోల్పోకుండా ఆడిన సింధు వరుసగా ఐదు పా యింట్లు గెలిచి 10–8తో ఆధిక్యంలోకొచ్చింది. అయితే తై జు యింగ్ కూడా పట్టుదలతో ఆడటంతో ఐదుసార్లు స్కోర్లు సమమయ్యాయి. స్కోరు 21–21 వద్ద సింధు చక్కటి రిటర్న్ షాట్, ఆ తర్వాత క్రాస్‌కోర్టు షాట్లతో వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలోనూ సింధు తడబడింది. 4–8తో వెనుకబడింది. అయితే ఈసారీ సింధు అద్భుతంగా పుంజుకుంది. స్కోరును 14–14 వద్ద సమం చేశాక ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. స్కోరు 19–19 వద్ద ఉన్నపుడు సింధు స్మాష్ షాట్‌తో ఒక పాయింట్ సాధించగా... ఆ తర్వాత తై జు యింగ్ కొట్టిన రిటర్న్ షాట్ బయటకు వెళ్లడంతో సింధు విజయం ఖాయమైంది. సూపర్ సాయి... ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో ర్యాంకర్ జిన్‌టింగ్ (ఇండోనేసియా)ను ఓడించిన సాయిప్రణీత్ క్వార్టర్ ఫైనల్లోనూ అదే జోరు కనబరిచాడు. సుదీర్ఘ ర్యాలీల్లో పైచేయి సాధించాడు. కీలకదశలో స్మాష్ షాట్లతో చెలరేగాడు. తొలి గేమ్ నెగ్గిన తర్వాత రెండో గేమ్‌లో సాయిప్రణీత్ మరింత దూకుడు పెంచాడు. జొనాథన్ క్రిస్టీకి తేరుకునే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో అత్యధికంగా ఐదు పతకాలు నెగ్గిన రికార్డు చైనా ప్లేయర్ జాంగ్ నింగ్ (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పేరిట ఉంది. తాజా ప్రదర్శనతో సింధు ఈ రికార్డును సమం చేసింది. 1: ప్రపంచ సీనియర్, జూనియర్ చాంపియన్‌షిప్‌లలో పతకాలు నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్ సాయిప్రణీత్. 2010 ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో సాయిప్రణీత్ కాంస్యం గెలిచాడు. 2: ఒకే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు పతకాలు రావడం ఇది రెండోసారి. 2017లో సింధు, సైనా రజత, కాంస్య పతకాలు నెగ్గారు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్)తో సాయిప్రణీత్... ప్రపంచ మూడో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా)తో సింధు ఆడతారు. మధ్యాహ్నం గం. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం ఉంది. -
స్థాయికి మించి ఆడాల్సిందే: మిథాలీ
మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టు ఇప్పుడు సెమీఫైనల్స్ బెర్త్ దక్కించుకోవాలంటే పటిష్టమైన ఆస్ట్రేలియా (12న), న్యూజిలాండ్ (15న) జట్లతో తలపడాల్సి ఉంది. దీంతో ఎలాంటి నిర్లక్ష్యానికి తావీయకుండా తమ శక్తిసామర్థ్యాలకు మించి ఆడాల్సిన అవసరం ఉందని కెప్టెన్ మిథాలీ రాజ్ అభిప్రాయపడింది. వరుసగా నాలుగు విజయాల అనంతరం టోర్నీలో భారత జట్టు దక్షిణాఫ్రికా చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే.