పురుషులు హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్ కాంస్య పతకం గెలుచుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో భారత్.. పాకిస్తాన్‌ను 4-3 తేడాతో ఓడించి కాంస్యం కైవసం చేసుకుంది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా మన్‌ప్రీత్ సింగ్ నిలిచాడు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ తరపున హర్మన్‌ప్రీత్, అక్షదీప్‌సింగ్, వరుణ్ కుమార్, గుర్‌సాహిబిజిత్ సింగ్‌లు గోల్ చేశారు.
చదవండి: BWF Rankings: అదరగొట్టిన కిదాంబి శ్రీకాంత్.. రెండేళ్ల తర్వాత..!
ఇక పాకిస్తాన్ తరపున అర్ఫాజ్, అబ్దుల్ రాణా, అహ్మద్ నదీమ్‌లు గోల్ చేశారు. ఇక లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో గ్రూఫ్ టాపర్‌గా నిలిచిన భారత్ సెమీఫైనల్లో మాత్రం జపాన్ చేతిలో చతికిలపడింది. అయితే కాంస్య పతక పోరు కోసం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రం భారత్ విజయం సాధించింది. లీగ్ దశలోనూ భారత్ పాకిస్తాన్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment