Asia Champions Trophy Hockey: సెమీఫైనల్లో ఓటమి పాలైన భారత్‌ | India Lose To Japan 3-5 In Semi-Final Hockey Asia Champions Trophy | Sakshi
Sakshi News home page

Asia Champions Trophy Hockey: సెమీఫైనల్లో ఓటమి పాలైన భారత్‌

Dec 21 2021 7:50 PM | Updated on Dec 21 2021 8:01 PM

India Lose To Japan 3-5 In Semi-Final  Hockey Asia Champions Trophy - Sakshi

India Lose Semi Final Vs Japan Hockey Asia Champions Trophy.. పురుషుల ఆసియా హాకీ చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ పోరు ముగిసింది. జపాన్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో 5-3 తేడాతో పరాజయం పాలైంది. ఇక ఫైనల్‌ చేరిన జపాన్‌.. దక్షిణ కొరియాతో అమీతుమీ తేల్చుకోనుంది.

ఇక ఇదే జపాన్‌ను లీగ్‌ దశలో 6-0 తేడాతో చిత్తు చేసిన భారత పురుషుల జట్టు మళ్లీ అదే ఫీట్‌ను పునరావృతం చేయలేకపోయింది. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్దతిలో జరిగిన లీగ్‌ దశలో 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో గ్రూఫ్‌ టాపర్‌గా నిలిచిన భారత్‌ కీలకమైన సెమీస్‌లో మాత్రం ఒత్తిడికి తలొగ్గి పరాజయం చవిచూసింది. ఇక మూడోస్థానం కోసం భారత్‌ పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement