
ఢాకా: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నమెంట్ లీగ్ దశను విజయంతో ముగించేందుకు డిఫెండింగ్ చాంపియన్ భారత హాకీ జట్టు సిద్ధమైంది. ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించిన టీమిండియా నేడు జరిగే తన చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌ను జపాన్‌తో ఆడనుంది. కొరియాతో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించిన భారత్... అనంతరం బంగ్లాదేశ్‌పై 9–0తో, పాకిస్తాన్‌పై 3–1తో గెలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో చివరిసారిగా జపాన్‌తో తలపడిన భారత్ ఆ మ్యాచ్‌లో 5–3 గోల్స్‌తో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment