pro leagues
-
FIH Player of the Year: హర్మన్‌ప్రీత్‌కు ‘ఎఫ్ఐహెచ్’ అవార్డు
న్యూఢిల్లీ: భారత స్టార్ డిఫెండర్ హర్మన్‌ప్రీత్ సింగ్ వరుసగా రెండో ఏడాది కూడా అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. అతను నిలకడైన ఆటతీరుతో ఇంటాబయటా జట్టు విజయాల్లో కీలకభూమిక పోషిస్తున్నాడు. ఈ భారత వైస్‌కెప్టెన్ 2021–22 ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్‌లో విశేషంగా రాణించాడు. 16 మ్యాచ్‌లాడిన హర్మన్‌ప్రీత్ 18 గోల్స్ చేశాడు. దీంతో ఒక సీజన్లో అత్యధిక గోల్స్ చేసిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతేడాది ఢాకాలో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అతని (6 మ్యాచ్‌ల్లో 8 గోల్స్) ప్రదర్శన వల్లే భారత జట్టు కాంస్యం గెలిచింది. ప్రతీ మ్యాచ్ లోనూ గోల్ చేయడం విశేషం. ఈ ఏడాది బర్మింగ్‌హామ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ‘కామన్వెల్త్ గేమ్స్’లో భారత్ రన్నరప్‌గా నిలువడంలోనూ అతని పాత్ర ఉంది. ‘హర్మన్‌ప్రీత్ ఆధునిక హాకీ క్రీడలో సూపర్‌స్టార్. అతని డిఫెన్స్ అద్భుతం. ప్రత్యర్థుల రక్షణపంక్తిని బోల్తా కొట్టించడంలో అతను ఘనాపాటి. తన స్టిక్కు అందిన బంతిని చకచకా ఆడిస్తూ తీసుకెళ్లే సామర్థ్యం అతని సొంతం. అదే వేగంతో గోల్‌పోస్ట్‌లోకి పంపడంలోనూ హర్మన్ దిట్ట. అందుకే వరుసగా ఈ ఏడాది కూడా అతన్నే అవార్డు వరించింది’ అని ఎఫ్ఐహెచ్ ఒక ప్రకటనలో కొనియాడింది. పురుషుల హాకీలో వరుసగా ఇలా అవా ర్డులు పొందిన నాలుగో ఆటగాడిగా హర్మన్ ఘనత వహించాడు. గతంలో డి నూయిజెర్ (నెదర్లాండ్స్), జేమీ డ్వెయర్ (ఆస్ట్రేలియా), ఆర్థర్ వాన్ డొరెన్ (బెల్జియం)లు రెండేళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచారు. తాజా అవార్డు బరిలో ప్యానెల్... హర్మన్ ప్రీత్ సింగ్‌కు 29.4 పాయింట్లు ఇవ్వగా, రేసులో ఉన్న బ్రింక్ మన్ (నెదర్లాండ్స్; 23.6), టామ్ బూన్ (బెల్జియం; 23.4) వెనుకబడ్డారు. -
Womens FIH Pro League: అమెరికాపై భారత్ పైచేయి
రోటర్‌డామ్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) మహిళల ప్రొ లీగ్‌లో భారత జట్టు ఖాతాలో ఐదో విజయం చేరింది. అమెరికా జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4–2 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున దీప్ గ్రేస్ ఎక్కా (31వ ని.లో), నవనీత్ కౌర్ (32వ ని.లో), సోనిక (40వ ని.లో), వందన కటారియా (50వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. అమెరికా జట్టు డానియెలా గ్రెగా (28వ ని.లో) గోల్‌తో ఖాతా తెరువగా... నటాలీ కొనెర్త్ (45వ ని.లో) రెండో గోల్ అందించింది. ఈ విజయంతో భారత జట్టు ప్రొ హాకీ లీగ్‌లో 13 మ్యాచ్‌లు పూర్తి చేసుకొని 27 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నేడు అమెరికా జట్టుతోనే భారత్ రెండో అంచె లీగ్ మ్యాచ్‌లో తలపడుతుంది. ఈ మ్యాచ్‌తో ప్రొ హాకీ లీగ్‌ను భారత్ ముగిస్తుంది. -
‘టాప్’లోనే టీమిండియా
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్‌లో భారత్ తమ సత్తా చాటుకుంది. ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 4–3 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత్ తొమ్మిది జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో 21 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (26వ, 43వ ని.లో), మన్‌ప్రీత్ సింగ్ (15వ, 26వ ని.లో) రెండు గోల్స్ చొప్పున సాధించారు. ఈ మ్యాచ్ ద్వారా హర్మన్‌ప్రీత్ కెరీర్లో 100 గోల్స్ మైలురాయిని దాటాడు. ఇంగ్లండ్ తరఫున లియామ్ సాన్ఫోర్డ్ (7వ ని.లో), డేవిడ్ కాన్డన్ (39వ ని.లో), సామ్ వార్డ్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. భారత్ ఈనెల 14, 15వ తేదీల్లో భువనేశ్వర్‌లోనే జర్మనీతో రెండు మ్యాచ్‌ల్లో తలపడుతుంది. -
‘షూటౌట్’లో భారత్ గెలుపు
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌లో భారత్ ఆరో విజయం నమోదు చేసింది. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ‘షూటౌట్’లో 3–2తో నెగ్గింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 3–3తో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు షూటౌట్‌ను నిర్వహించారు. ముందుగా తొలి ఐదు షాట్లు ముగిశాక రెండు జట్లూ 2–2తో సమంగా నిలిచాయి. అనంతరం ఆరో షాట్లో ఇరు జట్ల ఆటగాళ్లు విఫలమయ్యారు. ఏడో షాట్లో భారత్ తరఫున అభిషేక్ గోల్ చేయగా... ఇంగ్లండ్ తరఫున లియామ్ విఫలం కావడంతో టీమిండియా విజయం ఖాయమైంది. ఈ గెలుపుతో తొమ్మిది జట్లు బరిలో ఉన్న ప్రొ లీగ్‌లో భారత్ 18 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోకి వచ్చింది. నేడు ఇంగ్లండ్‌తో ఇదే వేదికపై రెండో మ్యాచ్ ఉంది. -
జుగ్రాజ్ హ్యాట్రిక్
పాచెఫ్స్ట్రోమ్ (దక్షిణాఫ్రికా): అంతర్జాతీయ హాకీ సమాఖ్య పురుషుల ప్రొ లీగ్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 10–2 గోల్స్ తేడాతో నెగ్గింది. భారత్ తరఫున రెండో మ్యాచ్ ఆడుతున్న ‘డ్రాగ్ ఫ్లికర్’ జుగ్రాజ్ సింగ్ మూడు గోల్స్‌తో (4వ, 6వ, 23వ ని.లో) ‘హ్యాట్రిక్’ సాధించాడు. గుర్సాహిబ్జిత్ సింగ్ (24వ, 36వ ని.లో), దిల్‌ప్రీత్ సింగ్ (25వ, 58వ ని.లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. హర్మన్‌ప్రీత్ సింగ్ (2వ ని.లో), అభిషేక్ (12వ ని.లో), మన్దీప్ సింగ్ (27వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మంగళవారం ఫ్రాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 5–0తో నెగ్గిన సంగతి విదితమే. -
అరంగేట్రంలోనే అదరగొట్టారు.. చైనాకు షాకిచ్చిన భారత అమ్మాయిలు
FIH Pro League 2021-22: ఒమన్ వేదికగా జరుగుతున్న ఎఫ్ఐహెచ్(అంతర్జాతీయ హాకీ సమాఖ్య) ప్రో లీగ్‌లో భారత మహిళల హాకీ జట్టుకు శుభారంభం లభించింది. సోమవారం చైనాను 7-1 గోల్స్ తేడాతో చిత్తుగా ఓడించిన భారత మహిళా జట్టు.. ప్రో లీగ్ అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టింది. సుశీల చాను(47వ నిమిషం, 52వ నిమిషం) రెండు గోల్స్‌తో రాణించగా.. నవనీత్ కౌర్, నేహా, వందనా కటారియా, షర్మిలా దేవీ, గుర్జీత్ కౌర్ తలో గోల్ చేశారు. చైనా తరఫున జు డెంగ్ 43వ నిమిషంలో గోల్ సాధించింది. ఈ విజయంతో భారత్ ప్రో లీగ్ 2021-22 పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. After our resounding win over 🇨🇳, we have jumped up to the 3️⃣rd place on the FIH Hockey Pro League 2021/22 (Women) points table! 👊#IndiaKaGame pic.twitter.com/yP8DMrX4uf — Hockey India (@TheHockeyIndia) January 31, 2022 చదవండి: విండీస్‌తో సిరీస్‌కు రెడీ.. బయో బబుల్‌లోకి వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు -
కరోనా కల్లోలం...
లుసానే: కరోనా (కోవిడ్–19) దెబ్బకు స్పోర్ట్స్ ఈవెంట్ల వాయిదా పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఐపీఎల్, ఈపీఎల్, ఎన్బీఏ, ఫార్ములావన్, బ్యాడ్మింటన్, టెన్నిస్‌లాంటి విఖ్యాత స్పోర్ట్స్ ఈవెంట్స్ వాయిదా పడగా... తాజాగా ఆ జాబితాలోకి హాకీ ప్రొ లీగ్ కూడా జరిగింది. ప్రస్తుతం జరుగుతోన్న ఈ లీగ్ రెండో సీజన్లో ఏప్రిల్ 15 వరకు జరిగే అన్ని మ్యాచ్‌లను రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) శనివారం ప్రకటించింది. అయితే వీటిని తిరిగి నిర్వహించేది లేనిది తెలియాల్సి ఉంది. ‘కరోనాపై మాకు అందుతున్న సమాచారం, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆదేశాలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను పరిగణలోకి తీసుకుంటూ... ఏప్రిల్ 15 వరకు జరిగే ప్రొ లీగ్ మ్యాచ్‌లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అని ఎఫ్ఐహెచ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లీగ్‌లో ఆడుతున్న హాకీ దేశాల సంఘాలతో చర్చించాకే ఎఫ్ఐహెచ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నాటికి కరోనా ఉధృతి తగ్గినట్లయితే... అదే నెల చివర్లో ఈ లీగ్ పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎఫ్ఐహెచ్ పేర్కొంది. ఈ లీగ్‌లో మొత్తం 9 జట్లు పాల్గొంటుండగా... భారత్ తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 26న బెర్లిన్ వేదికగా జర్మనీతో ఆడాల్సి ఉంది. -
పేరే పెట్టుబడి లేదు రాబడి
► వేర్వేరు క్రీడల జట్లలో భాగస్వాములుగా భారత క్రికెటర్లు ► జట్టు పాపులారిటీపై కనిపించని ప్రభావం ఒకట్రెండు కార్యక్రమాలకే పరిమితం క్రికెటర్‌గా ఇప్పటికే వచ్చిన పేరు ప్రతిష్టలతో పోలిస్తే కొత్తగా వచ్చే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమీ లేదు... ఆదాయ పరంగా కూడా ఫ్రాంచైజీ యజమానికి అంత గిట్టుబాటు అవుతుందని కూడా గ్యారంటీ ఏమీ లేదు... పోనీ సదరు ఆటకు చిన్నప్పటి నుంచి వీరాభిమాని కాబట్టి అభిమానంతో వెళ్లారా అంటే టోర్నీ ముగిశాక మరోసారి అటు వైపు తిరిగి కూడా చూసింది లేదు. మరి భారత క్రికెటర్లు ఇతర క్రీడల లీగ్‌లలో ఎందుకు సహ భాగస్వాములు అవుతున్నారు. వారు ఆశిస్తున్నదేమిటి. అసలు క్రికెటర్లు ఏ మాత్రం పెట్టుబడి పెడుతున్నారు. అది ఫ్రాంచైజీలకు ఏమైనా లాభం చేకూరుస్తోందా... క్రికెటర్లను ముందు పెడితే వారికి వస్తోందేమిటి. వారు తిరిగి ఇస్తున్నదేమిటి? సాక్షి క్రీడా విభాగం సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, రోహిత్ శర్మ... క్రికెటేతర లీగ్‌లలో భాగస్వాములుగా మారిన భారత క్రికెటర్ల జాబితా ఇది. గతంలో కపిల్ జమానానుంచి కూడా అనేక మంది క్రికెటర్లు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెడుతూనే వచ్చారు. కొన్ని మంచి లాభాలతో వెలిగిపోగా మరికొన్ని నష్టాలు చవిచూశాయి. అయితే ఇప్పుడు ఒకే సారి ఇంత మంది క్రికెటర్లు స్పోర్ట్స్ లీగ్‌లో భాగస్వాములుగా ఉండటం విశేషం. ఇటీవల ఆయా లీగ్‌లలో మ్యాచ్‌లు జరిగినప్పుడు జట్టులోని సభ్యుడో లేక కెప్టెనో కాకుండా... సచిన్ వర్సెస్ గంగూలీ, ధోని వర్సెస్ కోహ్లి అంటూ ఆ మ్యాచ్‌లు ఎక్కువగా ఆసక్తి రేపాయి. ఎవరెక్కడ..? భారత అత్యుత్తమ కెప్టెన్‌గా నిలిచిన ధోని ప్రస్తుతం రెండు లీగ్‌లలో భాగస్వామిగా ఉన్నాడు. హాకీ ఇండియా లీగ్‌లో తన సొంత నగరం పేరుతో ఉన్న రాంచీ రేస్, ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్‌లో చెన్నైయిన్ టీమ్‌లకు అతను సహ యజమాని. గతంలో ధోని ‘మహి రేసింగ్ టీమ్’లో కూడా పార్ట్నర్గా ఉన్నా... ఆర్థికపరమైన నష్టాలతో ఆ టీమ్ గత సీజన్లోనే పోటీనుంచి తప్పుకుంది. ఐఎస్ఎల్లో గోవా జట్టుకు భాగస్వామి అయి, ఇండియన్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్‌లో యూఏఈ రాయల్స్‌లో జత కట్టిన కోహ్లి... ఆ తర్వాత రెజ్లింగ్ లీగ్‌లో బెంగళూరు టీమ్‌ను కొన్నాడు. ఐఎస్ఎల్లో సచిన్ కేరళ బ్లాస్టర్స్, గంగూలీ కోల్‌కతాకు సహ యజమానులుగా ఉన్నారు. రైనా హాకీలోనే యూపీ విజార్డ్స్ టీమ్‌ను తీసుకోగా, రోహిత్ రెజ్లింగ్‌లో యూపీ వారియర్స్ టీమ్‌తో చేరాడు. వీరంతా తమ తమ జట్లలో పూర్తిగా వంద శాతం యజమానులుగా కాకుండా కన్సార్టియంగా ఏర్పడిన టీమ్‌లో భాగస్వాములుగా ఉన్నారు. ఆరంభ శూరత్వం ఆయా లీగ్‌లలో యజమానులుగా ఈ క్రికెటర్ల పాత్ర చూస్తే చాలా వరకు తాము భాగస్వామిగా చేరుతున్నట్లు ప్రకటిస్తూ హడావిడి చేయడానికే ఎక్కువగా పరిమితమవుతున్నారు. లేదంటే ఆరంభంలో ఉన్న జోష్ రానురానూ తగ్గిపోయి నామ్‌కే వాస్తేగా ఉండిపోతున్నారు. ఐఎస్ఎల్ తొలి సీజన్లో సచిన్ భారీ హంగామా చేశాడు. కేరళ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఆ రాష్ట్ర ప్రచారకర్తగా మారిపోయాడు. రెండో సీజన్‌కు వచ్చే సరికి అలాంటిది ఏమీ కనిపించకపోగా, పెద్దగా హంగామా కూడా లేదు. ఫుట్‌బాల్ అంటే పిచ్చి ఉన్న ధోని కొంత వరకు ఐఎస్ఎల్లో కనిపించినా... హాకీ విషయానికి వస్తే అతనితో పాటు రైనా కూడా ప్రారంభ కార్యక్రమం మినహా మరోసారి కనిపిస్తే ఒట్టు! కోహ్లి కూడా దాదాపుగా అంతే. విరాట్... పొరపాటున కూడా టెన్నిస్ మ్యాచ్‌ల వైపు చూడలేదు. ఇక రెజ్లింగ్కూ అతను దూరంగానే ఉన్నాడు. రెజ్లింగ్ లీగ్‌లలో ఒక్క మ్యాచ్‌కు కూడా రోహిత్ రాలేదు. పెట్టుబడి...రాబడి... అనధికారిక సమాచారం ప్రకారం ఈ క్రికెటర్లు కేవలం తమ ‘పేరు ప్రఖ్యాతులనే’ పెట్టుబడిగా పెడుతున్నారు. ‘ఇది ఒక రకంగా వారితో వ్యాపార ప్రకటన చేయిస్తున్నట్లే. మార్కెట్లో కొత్త వస్తువు ఏదైనా వస్తే దాని గురించి ప్రపంచానికి మొదటిసారి చెప్పాలంటే కాస్త హంగామా అవసరం. పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండే ఈ క్రికెటర్లు ఆ పని చేయగలరు. వారి వల్ల ఏ మాత్రం ప్రచారం లభించినా అది ప్రయోజనకరమే. అందుకే అసలు ఓనర్లు సహ యజమాని అనే ముద్దు పేరు పెట్టి వారిని తీసుకొస్తున్నారు’ అని ఒక ప్రముఖ మార్కెటింగ్ సంస్థకు చెందిన సీనియర్ అధికారి వెల్లడించారు. ‘క్రికెటర్లలో ఎక్కువ మంది ఎవరూ తమ సొంత డబ్బుతో పెట్టుబడి పెట్టడం లేదు. ఒక వేళ ఉన్నా నామమాత్రమే. ఒప్పందం ప్రకారం ఒకట్రెండు ప్రచార కార్యక్రమాలకు హాజరు కావాలి. లీగ్ ముగిశాక సదరు జట్టుకు లాభం వస్తే అందులో కొంత వాటాను అందిస్తారు. ఒక వేళ నష్టపోతే మాత్రం ఆ భారం వారిపై వేయరు. ‘రెండు రకాలుగా కూడా క్రికెటర్లకు ఇది ప్రయోజనకరం. మరో ఆట గురించి నాలుగు మంచి మాటలు చెబితే పోయేదేముంది. ఈ విషయంలో యాజమాన్యానికి తమ సొంత లెక్కలు ఉన్నాయి’ అని ఆ అధికారి విశ్లేషించారు. లాభం వస్తే కదా... ఐపీఎల్ స్ఫూర్తితోనే, దాదాపు అదే తరహాలో ఈ కొత్త లీగ్‌లన్నీ పుట్టుకొచ్చాయి. కానీ ఆర్థికంగా ఇవి నిర్వాహకులకు భారీ ఆదాయాలు తెచ్చి పెట్టాయా అనేది సందేహమే. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఐపీఎల్ జట్లు కూడా నష్టాలు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అలాంటప్పుడు క్రికెటేతర క్రీడల లీగ్‌ల ఫ్రాంచైజీలు మూటగట్టుకునేది పెద్దగా ఉండకపోవచ్చు. తాము ఆశించిన ఆదాయం వస్తే గానీ వారు మరొకరికి ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు జట్లకు భారీగా లాభాలు వచ్చిన దాఖలాలు కూడా లేవు. అలాంటప్పుడు వారు తమ వాటా పోగా అందులో కొంత మొత్తం క్రికెటర్లకు ఇచ్చేదెప్పుడు? మొత్తంగా చూస్తే ఇదో ప్రచారార్భటపు ప్రయత్నమే తప్ప దీని వల్ల సదరు లీగ్‌కు చెప్పుకోదగ్గ ప్రయోజనమూ దక్కడం లేదు, సదరు క్రీడకు విలువ కూడా పెరగడం లేదు. ఆ ఒక్కటి మినహా... క్రికెటర్ల పాత్ర లీగ్‌లను ఆకర్షణీయంగా మారుస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. దీనికి అత్యుత్తమ ఉదాహరణ ప్రొ కబడ్డీ లీగ్. ఈ టోర్నీలో ఒక్క క్రికెటర్ కూడా పెట్టుబడి పెట్టడం గానీ, సహ భాగస్వామిగా గానీ లేడు. కానీ ఐపీఎల్ తర్వాత కబడ్డీ లీగ్ మాత్రమే సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ లీగ్ అన్ని వర్గాలను ఆకట్టుకుంది. ఫలితంగా సంవత్సరం తిరిగే లోపే మరోసారి టోర్నీ జరిపేందుకు నిర్వాహకులు సన్నద్ధమైపోయారు. ఇదంతా కబడ్డీ క్రీడకు లభించిన ఆదరణే తప్ప దాని యజమానులకు కాదు. అంటే ఆటపై ఆసక్తి ఉన్న అభిమాని దాని వెనక ఎవరు ఉన్నా లేకపోయినా మ్యాచ్‌లను చూసేందుకు మాత్రం ఉత్సాహం చూపిస్తారనేది ఖాయం. ప్రయోజనం ఉందా... నిజంగా క్రికెటర్ల ప్రచారం లీగ్‌లకు ఏదైనా అదనపు మేలు చేస్తోందా అంటే సందేహమే. క్రికెటర్ల జట్లు కదా అని అభిమానులు పొలోమంటూ ఈ లీగ్‌లకు వెల్లువలా రావడం లేదు. గత రెండేళ్ల పరిస్థితి చూస్తే... ఐఎస్ఎల్ మ్యాచ్‌లు జరిగిన నగరాలను మాత్రమే ఆకర్షించగలిగింది. దేశంలోని ఇతర చోట్ల దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. టెన్నిస్‌కు కోహ్లికంటే ఫెడరర్, నాడల్, సానియాలే ప్రధాన ఆకర్షణ. క్రికెట్ స్టార్లు వచ్చినా, రాకున్నా దశాబ్దాలుగా హాకీకి అడ్డాలుగా ఉన్న కొన్ని చోట్లనే లీగ్ సక్సెస్ అవుతోంది తప్ప దక్షిణం దిశగా అసలు ప్రభావమే లేదు. ఇక తొలిసారి నిర్వహించిన రెజ్లింగ్ లీగ్ విజయవంతం అవుతుందా లేదా అనేదానిపై ఇంకా సందేహాలు ఉన్నాయి.