Womens FIH Pro League: అమెరికాపై భారత్‌ పైచేయి | Womens FIH Pro League: India Beat USA | Sakshi
Sakshi News home page

Womens FIH Pro League: అమెరికాపై భారత్‌ పైచేయి

Jun 22 2022 8:39 AM | Updated on Jun 22 2022 8:39 AM

Womens FIH Pro League: India Beat USA - Sakshi

రోటర్‌డామ్‌: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) మహిళల ప్రొ లీగ్‌లో భారత జట్టు ఖాతాలో ఐదో విజయం చేరింది. అమెరికా జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4–2 గోల్స్‌ తేడాతో గెలిచింది. భారత్‌ తరఫున దీప్‌ గ్రేస్‌ ఎక్కా (31వ ని.లో), నవనీత్‌ కౌర్‌ (32వ ని.లో), సోనిక (40వ ని.లో), వందన కటారియా (50వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు.

అమెరికా జట్టు డానియెలా గ్రెగా (28వ ని.లో) గోల్‌తో ఖాతా తెరువగా... నటాలీ కొనెర్త్‌ (45వ ని.లో) రెండో గోల్‌ అందించింది. ఈ విజయంతో భారత జట్టు ప్రొ హాకీ లీగ్‌లో 13 మ్యాచ్‌లు పూర్తి చేసుకొని 27 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నేడు అమెరికా జట్టుతోనే భారత్‌ రెండో అంచె లీగ్‌ మ్యాచ్‌లో తలపడుతుంది. ఈ మ్యాచ్‌తో ప్రొ హాకీ లీగ్‌ను భారత్‌ ముగిస్తుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement