CWC 2023: కుంబ్లే, యువరాజ్‌ రికార్డును బద్దలు కొట్టిన జడేజా | CWC 2023 IND VS NED: Ravindra Jadeja Takes Most Wickets By An Indian Spinner In A Single WC Edition | Sakshi
Sakshi News home page

CWC 2023: కుంబ్లే, యువరాజ్‌ రికార్డును బద్దలు కొట్టిన జడేజా

Published Mon, Nov 13 2023 11:16 AM | Last Updated on Mon, Nov 13 2023 11:36 AM

CWC 2023 IND VS NED: Ravindra Jadeja Takes Most Wickets By An Indian Spinner In A Single WC Edition - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు (16) పడగొట్టిన స్పిన్‌ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. జడ్డూకు ముందు ఈ రికార్డు అనిల్‌ కుంబ్లే, యువరాజ్‌ సింగ్‌ల పేరిట సంయుక్తంగా ఉండేది. 1996 వరల్డ్‌కప్‌లో కుంబ్లే, 2011 వరల్డ్‌కప్‌లో యువరాజ్‌ 15 వికెట్లు పడగొట్టాడు.

తాజాగా జడ్డూ వీరిద్దరి రికార్డును అధిగమించి, వరల్డ్‌కప్‌ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ ఇండియన్‌ స్పిన్‌ బౌలర్‌గా అవతరించాడు. ఈ విభాగంలో కుల్దీప్‌ (14 వికెట్లు).. జడేజా, కుంబ్లే, యువరాజ్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. కాగా, వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్ల రికార్డు జహీర్‌ ఖాన్‌ పేరిట ఉంది. 2011 ఎడిషన్‌లో అతను 9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. 

ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. కేఎల్‌ రాహుల్‌ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (94 బంతుల్లో 128 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (61), శుభ్‌మన్‌ గిల్‌ (51), విరాట్‌ కోహ్లి (51) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది.

అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌ భారత బౌలర్లు తలో చేయి వేయడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. విరాట్‌, రోహిత్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.
 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement