నెదర్లాండ్స్‌పై విక్టరీతో వన్డే వరల్డ్‌కప్ 2023లో వరుసగా తొమ్మిది విజయాలు సాధించిన టీమిండియా ఓ అరుదైన ఘనత సాధించింది. వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకింది. 2003 ఎడిషన్‌లో సాధించిన 8 వరుస విజయాల రికార్డును భారత్ ప్రస్తుత ఎడిషన్‌లో అధిగమించింది.
ప్రపంచకప్ చరిత్రలో ఓ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక విజయాల రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. ఐదుసార్లు ఛాంపియన్ అయిన ఈ జట్టు 2003, 2007 ఎడిషన్లలో వరుసగా 11 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ఈ జాబితాలో ఆసీస్, భారత్‌ల తర్వాత న్యూజిలాండ్ ఉంది. ఈ జట్టు 2015 వరల్డ్‌కప్‌లో భారత్ పూర్వపు రికార్డుతో సమానంగా వరుసగా 8 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది.
నెదర్లాండ్స్‌పై గెలుపుతో టీమిండియా తొమ్మిది వరుస విజయాల రికార్డుతో పాటు మరో ఘనత కూడా సాధించింది. ఓ క్యాలెండర్ ఇయర్‌లో తమ అత్యుత్తమ విజయాల రికార్డును ఈ గెలుపుతో సమం చేసింది. 1998లో 24 వన్డేల్లో విజయాలు సాధించిన భారత్.. ప్రస్తుత ఏడాది ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే ఆ మార్కును అందుకుంది.
కాగా, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది.
అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత బౌలర్లు తలో చేయి వేయడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. విరాట్, రోహిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment