అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్ 2023లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు ప్రాతినిథ్యం లభించింది. వీరిలో ఒకరు తెలంగాణకు చెందిన ఆటగాడు కాగా, మరొకరు ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన క్రికటర్. తెలంగాణలోని హైదరాబాద్ నగరానికి చెందిన మొహమ్మద్ సిరాజ్ టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించిన తేజ నిడమనూరు నెదర్లాండ్స్ క్రికెట్ జట్టుకు ఆడుతున్నాడు.
29 ఏళ్ల తేజ విజయవాడ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కు వలస వెళ్లి, అక్కడే స్థిరపడి డచ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తేజ నెదర్లాండ్స్ జట్టుకు బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్నాడు. డచ్ టీమ్ తరఫున 20 వన్డేలు, 6 టీ20లు ఆడిన తేజ.. మొత్తంగా 531 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో తేజ ఓ అద్భుతమైన సెంచరీ చేసి, డచ్ టీమ్ ఈ ఏడాది వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవ్వడంలో కీలకపాత్ర పోషించాడు.
మరోవైపు తెలంగాణలోని హైదరాబాద్ నగరానికి చెందిన 29 ఏళ్ల మొహమ్మద్ సిరాజ్ టీమిండియా స్టార్ పేసర్‌గా ఎదుగుతున్నాడు. ఇటీవలే అతను నంబర్ వన్ వన్డే బౌలర్‌గా అవతరించాడు. టీమిండియా తరఫున 21 టెస్ట్‌లు, 29 వన్డేలు8 టీ20లు ఆడిన సిరాజ్ మొత్తంగా 123 వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే, వన్డే ప్రపంచకప్-2023 భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ధి పాక్‌ను అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో ఢీకొంటుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో మెగా టోర్నీ ముగుస్తుంది.
బంగ్లాదేశ్ మినహా..
వన్డే ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ మినహా అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. జట్ల ప్రకటనకు ఆఖరి తేదీ సెప్టెంబర్ 28గా ఐసీసీ నిర్ణయించింది.
జట్ల వివరాల..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్
సౌతాఫ్రికా: టెంబా బవుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, రస్సీ వాన్ డర్ డస్సెన్, మార్కో జన్సెన్, అండిల్ ఫెహ్లుక్వాయో, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, గెరాల్డ్ కొయెట్జీ, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, లిజాడ్ విలియమ్స్, కగిసో రబాడ, తబ్రేజ్ షంషి
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, అస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్
నెదర్లాండ్స్: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), విక్రమ్‌జీత్ సింగ్, సకీబ్ జుల్ఫికర్, సైబ్రాండ్ ఎంజెల్‌బ్రెచ్, కొలిన్ అకెర్‌మ్యాన్, బాస్ డీ లీడ్, తేజ నిడమనూరు, షరీజ్ అహ్మద్, మ్యాక్స్ ఔడౌడ్, రోల్ఫ్ వాన్ డర్ మెర్వ్, వెస్లీ బర్రెసీ, లొగన్ వాన్ బీక్, ర్యాన్ క్లెయిన్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, రచిన్ రవీంద్ర, విల్ యంగ్, మిచెల్ సాంట్నర్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, ట్రెంట్ బౌల్ట్, లోకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, ఐష్ సోధి, టిమ్ సౌథీ
ఆఫ్ఘనిస్తాన్: హస్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీమ్ జద్రాన్, రియాజ్ హసన్, నజీబుల్లా జద్రాన్, రెహ్మాత్ షా, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, రషీద్ ఖాన్, రహ్మానుల్లా గుర్బాజ్, ఇక్రమ్ అలికిల్, అబ్దుల్ రహ్మాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హాక్ ఫారూకీ, నవీన్ ఉల్ హాక్
ఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, డేవిడ్ మలాన్, లియామ్ లివింగ్‌స్టోన్, జో రూట్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, సామ్ కర్రన్, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, జానీ బెయిర్‌స్టో, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, రీస్ టాప్లే, మార్క్ వుడ్
పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హాక్, ఫకర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, అఘా సల్మాన్, సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ రిజ్వాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, మొహమ్మద్ వసీం జూనియర్, షాహీన్ అఫ్రిది, ఉసామా మిర్
శ్రీలంక: దసున్ షనక(కెప్టెన్), కుశాల్ మెండిస్, పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, దిముత్ కరుణరత్నే, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, సదీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, మతీశ పతిరణ, లహిరు కుమార, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, దిల్షన్ మధుశంక
Comments
Please login to add a commentAdd a comment