
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో టోర్నీ తొలి మ్యాచ్‌కు దూరమైన కివీస్ రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ఇప్పుడు డచ్‌తో మ్యాచ్‌కు అందుబాటులో లేడు. అతడు ఇంకా పూర్తి స్ధాయి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో జట్టు మేనెజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ విషయాన్ని న్యూజిలాండ్ ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ ధృవీకరించాడు. అయితే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉన్న పేసర్ లూకీ ఫెర్గూసన్ మాత్రం నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు.లాకీ ఫెర్గూసన్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. ఈ నేపథ్యంలో అతడు నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడు.
టిమ్ సౌథీ కూడా తన ప్రాక్టీస్‌ను మొదలపెట్టాడు. అతడు బౌలింగ్ చేసేందుకు సిద్దమయ్యాడు. టిమ్ ఫీల్డింగ్ కూడా ప్రాక్టీస్ కూడా చేశాడు. అతడి చేతి వేలికి ఆదివారం మరోసారి ఎక్స్-రే చేయ్యాలి. ఆ తర్వాత అతడి సెలక్షన్‌పై ఓ నిర్ణయం తీసుకుంటాం. ఇక కేన్ విలియమ్సన్ కూడా బాగా కోలుకుంటున్నాడు. అతడు ఫీల్డింగ్ చేయడానికి ఇంకా ఇబ్బంది పడుతున్నాడు.
కాబట్టి అతడు నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కూ దూరం కానున్నాడు. కేన్ మా మూడో మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నానని స్టెడ్ పేర్కొన్నాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించింది. కివీస్ బ్యాటర్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర అద్భుత సెంచరీలతో చెలరేగారు. సోమవారం హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో బ్లాక్ క్యాప్స్ తలపడనుంది.
చదవండి: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటర్.. ఏబీ డివిలియర్స్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలు