సూపర్‌-8లో చివరి బెర్త్‌ నేడు (జూన్‌ 16) ఖరారు | Today's (June 16) Matches In T20 World Cup 2024 | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: సూపర్‌-8లో చివరి బెర్త్‌ నేడు (జూన్‌ 16) ఖరారు

Published Sun, Jun 16 2024 11:59 AM | Last Updated on Sun, Jun 16 2024 12:20 PM

Todays (June 16) Matches In T20 World Cup 2024

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో చివరి బెర్త్‌ నేడు (జూన్‌ 16) ఖరారు కానుంది. గ్రూప్‌-డి నుంచి రెండో స్థానంలో నిలిచే జట్టేదో ఇవాళ జరిగే మ్యాచ్‌లతో తేలిపోనుంది. గ్రూప్‌-డి నుంచి సూపర్‌-8 రేసులో ఉన్న బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ నేడు వేర్వేరు జట్లతో తలపడనున్నాయి.

సెయింట్‌ విన్సెంట్‌ వేదికగా జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ నేపాల్‌తో తలపడనుండగా.. సెయింట్‌ లూసియా వేదికగా జరిగే మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌.. శ్రీలంకను ఢీకొట్టనుంది. నేపాల్‌పై బంగ్లాదేశ్‌ గెలిస్తే నెదర్లాండ్స్‌-శ్రీలంక మ్యాచ్‌తో సంబంధం లేకుండా బంగ్లాదేశ్‌ సూపర్‌-8లోకి ప్రవేశిస్తుంది. ఒక వేళ నేపాల్‌ చేతిలో బంగ్లాదేశ్‌ ఓడి.. శ్రీలంకపై నెదర్లాండ్స్‌ గెలిస్తే నెదర్లాండ్స్‌ సూపర్‌-8కు అర్హత సాధిస్తుంది. గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా ఇదివరకే సూపర్‌-8లోకి ప్రవేశించింది.

బంగ్లాదేశ్‌-నేపాల్‌ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రేపు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభం కానుండగా.. నెదర్లాండ్స్‌-శ్రీలంక మ్యాచ్‌ రేపు ఉదయం 6 గంటలకు మొదలవుతుంది.

ఈ రెండు మ్యాచ్‌లతో పాటు ఇవాళ మరో మ్యాచ్‌ కూడా జరుగనుంది. గ్రూప్‌-ఏలో భాగంగా పాకిస్తాన్‌-ఐర్లాండ్‌ మధ్య నామమాత్రపు మ్యాచ్‌ జరుగనుంది. ఫ్లోరిడా వేదికగా ఈ మ్యాచ్‌ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. గ్రూప్‌-ఏ నుంచి భారత్‌, యూఎస్‌ఏ ఇదివరకే సూపర్‌-8కు అర్హత సాధించడంతో ఈ మ్యాచ్‌ నామమాత్రంగా సాగనుంది.

సూపర్‌-8కు అర్హత సాధిం‍చిన జట్లు..

గ్రూప్‌-ఏ నుంచి భారత్‌, యూఎస్‌ఏ

గ్రూప్‌-బి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌

గ్రూప్‌-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌, వెస్టిండీస్‌

గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌/నెదర్లాండ్స్‌

సూపర్‌-8లో గ్రూప్‌-1 మ్యాచ్‌లు..

జూన్‌ 20- ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ ఇండియా (బార్బడోస్‌)
జూన్‌ 20- ఆస్ట్రేలియా వర్సెస్‌ D2 (బంగ్లాదేశ్‌ లేదా నెదర్లాండ్స్‌) (ఆంటిగ్వా)
జూన్‌ 22- ఇండియా వర్సెస్‌ D2 (బంగ్లాదేశ్‌ లేదా నెదర్లాండ్స్‌) (ఆంటిగ్వా)
జూన్‌ 22- ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా (సెయింట్‌ విన్సెంట్‌)
జూన్‌ 24- ఆస్ట్రేలియా వర్సెస్‌ ఇండియా (సెయింట్‌ లూసియా)
జూన్‌ 24- ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ D2 (బంగ్లాదేశ్‌ లేదా నెదర్లాండ్స్‌) (సెయింట్‌ విన్సెంట్‌)

సూపర్‌-8లో గ్రూప్‌-2 మ్యాచ్‌లు..

జూన్‌ 19- యూఎస్‌ఏ వర్సెస్‌ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)
జూన్‌ 19- ఇంగ్లండ్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ (సెయింట్‌ లూసియా)
జూన్‌ 21- ఇంగ్లండ్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా (సెయింట్‌ లూసియా)
జూన్‌ 21- యూఎస్‌ఏ వర్సెస్‌ వెస్టిండీస్‌ (బార్బడోస్‌)
జూన్‌ 23- యూఎస్‌ఏ వర్సెస్‌ ఇంగ్లండ్‌ (బార్బడోస్‌)
జూన్‌ 23- వెస్టిండీస్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement