టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 13) బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. కింగ్స్‌టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సూపర్-8కు చేరే క్రమంలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతానికి ఇరు జట్లు చెరి రెండు మ్యాచ్‌లు ఆడి తలో మ్యాచ్‌లో గెలిచి గ్రూప్-డిలో రెండు (బంగ్లాదేశ్), మూడు (నెదర్లాండ్స్) స్థానాల్లో ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టాప్ ప్లేస్‌లో ఉన్న సౌతాఫ్రికాతో పాటు సూపర్-8కు చేరే అవకాశాలు అధికంగా ఉంటాయి. నేటి మ్యాచ్ కోసం బంగ్లాదేశ్.. గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించగా.. నెదర్లాండ్స్ ఓ మార్పు చేసింది. గత మ్యాచ్‌లో ఆడిన తేజ నిడమానూరు స్థానంలో ఆర్యన్ దత్‌ను బరిలోకి దించింది.
తుది జట్లు..
నెదర్లాండ్స్: మైకేల్ లెవిట్, మాక్స్ ఓడౌడ్, విక్రమ్‌జిత్ సింగ్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(వికెట్‌కీపర్/కెప్టెన్), బాస్ డి లీడే, లోగాన్ వాన్ బీక్, టిమ్ ప్రింగిల్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్, వివియన్ కింగ్మా
బంగ్లాదేశ్: తంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), లిట్టన్ దాస్(వికెట్‌కీపర్), షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రెహమాన్
Comments
Please login to add a commentAdd a comment