బంగ్లాదేశ్‌ అత్యంత చెత్త రికార్డు.. ఏకైక జట్టుగా | Bangladesh register bizarre record In T20 Worldcups | Sakshi
Sakshi News home page

T20 World cup 2024: బంగ్లాదేశ్‌ అత్యంత చెత్త రికార్డు.. ఏకైక జట్టుగా

Published Wed, Jun 26 2024 12:01 PM | Last Updated on Wed, Jun 26 2024 12:46 PM

Bangladesh register bizarre record In T20 Worldcups

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో బంగ్లాదేశ్ అత్యంత చెత్త రికార్డును త‌మ పేరిట లిఖించుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు అన్ని వ‌ర‌ల్డ్‌క‌ప్‌లు ఆడి ఒక్క‌సారి కూడా సెమీఫైన‌ల్‌కు చేర‌ని ఆ జ‌ట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2024లో సూప‌ర్‌-8లో రౌండ్‌లో నిష్క్ర‌మించిన బంగ్లా జ‌ట్టు.. ఈ చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకుంది.

 2007లో జ‌రిగిన తొట్ట‌తొలి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ నుంచి ఈ మెగా టోర్నీలో భాగ‌మవుతున్న బంగ్లాదేశ్ ఒక్క‌సారి కూడా సెమీస్‌లో అడుగుపెట్ట‌లేక‌పోయింది. టాప్‌-10లో ఉన్న ఇత‌ర 9 జ‌ట్లు క‌నీసం ఒక్క‌సారైనా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్‌కు చేరుకున్నాయి.

భార‌త్‌, ఆసీస్‌, ఇంగ్లండ్‌, ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక‌, వెస్టిండీస్‌, అఫ్గానిస్తాన్ జ‌ట్లు ఏదో ఒక వ‌ర‌ల్డ్‌క‌ప్‌లోనైనా సెమీస్‌కు చేరాయి. చివ‌ర‌గా ఈ ఏడాది సూప‌ర్‌-8లో సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న చేసిన అఫ్గానిస్తాన్ తొలి సారి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్‌లో అడుగుపెట్టింది.  టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2024లో 7 మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్‌ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement