తొలి విజయం సాధించిన శ్రీలంక.. | Netherlands Vs Sri Lanka Live Score, ICC ODI Cricket World Cup 2023: Sri Lanka Beat Netherlands By 5 Wickets - Sakshi
Sakshi News home page

CWC 2023 NED vs SL: తొలి విజయం సాధించిన శ్రీలంక..

Published Sat, Oct 21 2023 6:49 PM | Last Updated on Sat, Oct 21 2023 7:00 PM

Sri Lanka beat Netherlands by 5 wickets - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో శ్రీలంక ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా లక్నో వేదికగా శనివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపొందింది. 263 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 48.2 ఓవర్లలో లంక ఛేదించింది. శ్రీలంక బ్యాటర్లలో సదీరా సమరవిక్రమచక్ర(91 నాటౌట్‌) మ్యాచ్‌ విన్నింగ్‌ నాక్‌ ఆడాడు.

అతడితో పాటు నిస్సంకా(54), అసలంక(44) పరుగులతో రాణించారు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో అర్యన్‌ దత్త్‌ 3 వికెట్లు పడగొట్టగా.. అకెరమన్‌, వాన్‌ మీకరన్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌ 262 పరుగులకు ఆలౌటైంది. నెదర్లాండ్స్‌  బ్యాటర్లలో ఎంగెల్‌బ్రెచ్ట్‌ (70), వాన్‌ బీక్‌ (59) పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో  పేసర్లు మధుశంక, రజితా తలా నాలుగు వికెట్లు సాధించారు.
చదవండి: SA vs ENG WC 2023: క్లాసెన్‌ విధ్వంసకర శతకం.. ఇంగ్లండ్‌ టార్గెట్‌ 400 పరుగులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement