వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇవాళ న్యూజిలాండ్-నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ ఓ మార్పు చేసింది. జేమ్స్ నీషమ్ స్థానంలో లోకీ ఫెర్గూసన్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు నెదర్లాండ్స్ ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసింది. సైబ్రాండ్ ఏంజెల్‌బ్రెచ్, ర్యాన్ క్లెయిన్ జట్టులోకి వచ్చారు. కాగా, న్యూజిలాండ్ గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై విజయం సాధించగా.. నెదర్లాండ్స్ పాకిస్తాన్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే.
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ, లోకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కొలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడ్, తేజ నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్), సైబ్రాండ్ ఏంజెల్‌బ్రెచ్, ర్యాన్ క్లెయిన్, రోల్ఫ్ వాన్ డెర్ మెర్వ్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్
Comments
Please login to add a commentAdd a comment