వరల్డ్‌కప్-2023లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. శుక్రవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానం వేదికగా పాకిస్తాన్- నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 2 ఈ మ్యాచ్ గంటలకు ప్రారంభమవుతుంది. క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శనతో తమను తాము నిరూపించుకున్న నెదర్లాండ్స్.. ప్రధాన టోర్నీలోనూ సత్తాచాటాలని భావిస్తోంది.
మరోవైపు డచ్ జట్టును చిత్తు టోర్నీని ఘనంగా ఆరంభించాలని పాకిస్తాన్ యోచిస్తోంది. అయితే నెదర్లాండ్స్‌ను తక్కువగా అంచనా వేస్తే పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే వన్డే ప్రపంచకప్ క్వాలిఫియర్స్‌లో వెస్టిండీస్ వంటి జట్టునే నెదర్లాండ్స్ చిత్తు చేసింది. కాగా ఈ ప్రధాన టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన రెండు వామప్ మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ ఓటమి పాలైంది. మరి ప్రధాన టోర్నీని ఎలా ఆరంభిస్తుందో వేచి చూడాలి.
12 గంటల నుంచి ఎంట్రీ..
ఇక ఈ మ్యాచ్ కోసం 1200 మంది పోలీస్‌లతో భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అభిమానులకు ఎంట్రీ ఇవ్వనున్నారు. మ్యాచ్ జరిగే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పోలీసులు విధించారు. అదే విధంగా అర్ద రాత్రి వరకు మెట్రో రైల్వే సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
తుది జట్లు(అంచనా)
పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, అఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ.
నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, వెస్లీ బరేసి, బాస్ డి లీడ్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), కోలిన్ అకెర్‌మాన్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మీకెరెన్, ర్యాన్ క్లైన్, ఆర్యన్ దత్
చదవండి: World Cup 2023: ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment