Cricket World Cup final
-
1983 World Cup: భారత క్రికెట్ చరిత్రను మార్చేసిన ఆ మ్యాచ్..
"ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. ఈ ఆరు గంటల తర్వాత మన జీవితాలు పూర్తిగా మారిపోతాయి. ఆటలో గెలుపు ఓటములు సహజం. కానీ గెలిచేందుకు మనం తీవ్రంగా శ్రమించాలి. ఇది మనకు చావో రేవో. ప్రత్యర్ధి ఎవరన్నది మనకు అనవసరం.మనం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. గెలిచిన ఓడినా ఒకేలా ఉండాలి. అంతే తప్ప తర్వాత అనవసర చర్చలు పెట్టుకోవద్దు. ఆల్ ది బెస్ట్ ”.. ఇవీ 1983 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లకు కెప్టెన్ కపిల్ దేవ్ చెప్పిన మాటలు.25 జూన్ 1983.. భారత క్రికెట్లో సరికొత్త చరిత్ర అవిష్కతృమైంది. అప్పటివరకు పసికూనలుగా ముద్రపడిన భారత జట్టు.. ఆ రోజు ప్రపంచానికి తమ సత్తా ఏమిటో చూపించింది. 1983 వన్డే వరల్డ్‌కప్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో ఓటమంటూ ఎరుగని వెస్టిండీస్‌ను ఓడించి తొలి ప్రపంచకప్ టైటిల్‌ను కపిల్ డేవిల్స్ ముద్దాడింది. తొలి వరల్డ్‌కప్‌ను గెలిచి లార్డ్స్ మైదానంలో భారత జెండాను కపిల్ సేన రెపలాపడించింది. ఈ విజయంతో యావత్తు భారత్ గర్వంతో ఉప్పొంగిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కపిల్ దేవ్ పట్టిన క్యాచ్ వరల్డ్‌కప్‌తో పాటు భారత క్రికెట్ చరిత్రను మార్చేసింది.నిప్పులు చేరిగిన విండీస్ బౌలర్లు..అప్పట్లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లకు పెట్టింది పేరు. అయితే ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ తొలుత భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో భారత కెప్టెన్ కపిల్ దేవ్ ఊపిరి పీల్చుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసి ప్రత్యర్ధి ముందు భారీ స్కోర్ ఉంచి.. లక్ష్యచేధనలో ఒత్తిడి పెంచాలని కపిల్ భావించాడు.కానీ అక్కడ ఉంది కరేబియన్లు. ఆరంభంలోనే స్టార్ ఓపెనర్ సునీల్ గవాస్కర్‌ను ఔట్ చేసి విండీస్ బౌలర్లు భారత్‌ను దెబ్బ కొట్టారు. ఆ తర్వాత మరో ఓపెనర్ శ్రీకాంత్, ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన మోహిందర్ అమర్నాథ్ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.శ్రీకాంత్, అమర్నాథ్ కలిసి రెండో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరూ భారత స్కోర్ 90 పరుగుల వద్ద వరుస క్రమంలో పెవిలియన్‌కు చేరారు. దీంతో టీమిండియా పతనం మొదలైంది. వరుసగా వికెట్లు కోల్పోయిన భారత జట్టు.. 54.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. శ్రీకాంత్(38), అమర్నాథ్(26) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు.ఆరంభం ఆదుర్స్..ఇక 184 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విండీస్ ఊదిపడేస్తుందని అంతా భావించారు. భారత ఓటమితో ఇంటిముఖం పట్టకతప్పదని అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. కానీ భారత బౌలర్లు అద్భుతం చేశారు. భారత పేసర్ బల్వీందర్ సంధు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే విండీస్ ఓపెనర్ గోర్డాన్ గ్రీనిడ్జ్‌ను ఔట్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత మదన్‌లాల్ వరుసగా రెండు వికెట్లు పడగొట్టి విండీస్‌ను బ్యాక్‌ఫుట్‌లో ఉంచాడు. అయితే ఈ సమయంలో దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ మాత్రం భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు.మదన్ లాల్ మ్యాజిక్..మ్యాచ్‌పై భారత పట్టు బిగిస్తున్న సమయంలో రిచర్డ్స్ ఎటాక్ చేయడంతో కెప్టెన్ కపిల్‌దేవ్ ముఖంలో కాస్త టెన్షన్ కన్పించింది. రెండు వికెట్ల పడగొట్టిన మదన్‌లాల్‌ను సైతం రిచర్డ్స్ టార్గెట్ చేశాడు. మదన్‌లాల్ వేసిన ఓ ఓవర్లో రిచర్డ్స్ మూడు ఫోర్లు కొట్టి మ్యాచ్‌ను తమవైపు తిప్పే ప్రయత్నం రిచర్డ్స్ చేశాడు. ఈ క్రమంలో రోజర్ బిన్నీని కపిల్ దేవ్ ఎటాక్‌లోకి తీసుకువచ్చి రిచర్డ్స్ దూకుడును కట్టడి చేయాలని భావించాడు. బిన్నీ పరుగులు రాకుండా ఆపినప్పటికి.. అతడి వికెట్ మాత్రం సాధించలేకపోయాడు. అయితే మళ్లీ మదన్‌లాల్.. కపిల్ దగ్గరకు వచ్చి నేను బౌలింగ్ చేస్తా అని చెప్పాడు.కానీ అంతకుముందు ఓవరే మూడు ఫోర్లు ఇవ్వడంతో కపిల్ దేవ్ మదన్‌లాల్‌ను పక్కన పెట్టాలని అనుకున్నాడు. అయినా సరే మదన్ మాత్రం తనకు ఒక్క ఓవర్ వేసే అవకాశాన్ని ఇవ్వమన్నాడు. అందుకు సరే అని కపిల్ అతడికి మరో ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఆ ఓవర్లో మదన్ లాల్ మ్యాజిక్ చేశాడు.కపిల్ సూపర్ క్యాచ్..ఈసారి మాత్రం కెప్టెన్ నమ్మకాన్ని మదన్‌లాల్ వమ్ముచేయలేదు. ఆ ఓవర్లో మదన్ లాల్ అద్భుతం చేశాడు. వీవీ రిచర్డ్స్‌ను ఔట్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అయితే ఈ వికెట్ క్రెడిట్ మదన్ లాల్ కంటే కెప్టెన్ కపిల్ దేవ్కే ఇవ్వాలి. సంచలన క్యాచ్‌తో వీవియన్ను కపిల్ దేవ్ పెవిలియన్‌కు పంపాడు. ఆ ఓవర్లో మూడో బంతిని మదన్ లాల్ రిచర్డ్స్కు షార్ట్ పిచ్ డెలివరీగా సంధించాడు. అతడు ఆ డెలివరీని హుక్ షాట్ ఆడాలని ప్రయత్నించాడు. కానీ బంతి సరిగ్గా షాట్ కనక్ట్‌కాకపోవడంతో బంతి డీప్ మిడ్ వికెట్ దిశగా గాల్లోకి లేచింది. ఈ సమయంలో మిడ్-ఆన్‌లో ఉన్న కపిల్ దేవ్.. డీప్ మిడ్-వికెట్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు.ఆ క్యాచ్‌తో విండీస్ ఖేల్ ఖతమైంది. వరుసగా వికెట్లు కోల్పోయి 140 పరుగులకే కరేబియన్ జట్టు కుప్పకూలింంది. దీంతో 43 పరుగులతో భారత్ చారిత్రత్మక విజయాన్ని సాధించింది. భారత బౌలర్లలో అమర్ నాథ్, మదన్ లాల్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సంధు రెండు, బిన్నీ ఒక్క వికెట్ సాధించారు. -
వరల్డ్ కప్ ఫైనల్ వేళ.. అమెరికా రాయబారి సందడి.. వీడియో ట్రెండింగ్!
ప్రపంచమంతా క్రికెట్ వరల్డ్ కప్ హడావుడి నెలకొంది. ఇప్పటికే రెండు సార్లు ప్రపంచ కప్ సాధించిన తర్వాత భారత జట్టు మరోసారి వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఉత్కంఠభరితమైన ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ సందడి చేశారు. 1983లో తొలిసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టులోని కొందరు సభ్యులను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కలిశారు. బ్యాట్ పట్టి వారితో సరదాగా క్రికెట్ ఆడారు. నాటి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. 1983 విజయం 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ వేడుకలకు సంకేతంగా తాను సంతకం చేసిన బ్యాట్‌ను లెజెండరీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రోజర్ బిన్నీ, జిమ్మీ అమర్నాథ్, కీర్తి ఆజాద్, రవిశాస్త్రిలకు బహూకరించారు. దీనికి సంబంధిచిన వీడియోను ఎరిక్ గార్సెట్టీ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. భారత్‌లో క్రికెట్ అభివృద్ధికి బాటలు వేశారంటూ 1983 వరల్డ్ కప్ నెగ్గిన లెజండరీ క్రికెటర్లను అభినందిస్తూ భారత్ మరోసారి ట్రోఫీని గెలవాలని ఆకాంక్షించారు. భారత్ ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఆడుతున్న తరుణంలో గార్సెట్టీ షేర్ చేసిన ఈ వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. అత్యధికంగా వ్యూవ్స్, లైక్స్ వచ్చాయి. అలాగే పలువురు స్పందిస్తూ కామెంట్లు చేశారు. Met the OGs of cricket 🏏 – '83 legends @therealkapildev, Sunil Gavaskar, @iRogerBinny, @JimmyAmarnath, @KirtiAzaad, and @RaviShastriOfc! They bowled me over with their stories from India's first cricket World Cup victory! Rooting for #TeamIndia for the World Cup final on Sunday.… pic.twitter.com/71aTKDIuax — U.S. Ambassador Eric Garcetti (@USAmbIndia) November 17, 2023 -
ఉప్పల్ వేదికగా పాక్-నెదర్లాండ్స్ పోరు.. సర్వం సిద్దం
వరల్డ్‌కప్-2023లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. శుక్రవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానం వేదికగా పాకిస్తాన్- నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 2 ఈ మ్యాచ్ గంటలకు ప్రారంభమవుతుంది. క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శనతో తమను తాము నిరూపించుకున్న నెదర్లాండ్స్.. ప్రధాన టోర్నీలోనూ సత్తాచాటాలని భావిస్తోంది. మరోవైపు డచ్ జట్టును చిత్తు టోర్నీని ఘనంగా ఆరంభించాలని పాకిస్తాన్ యోచిస్తోంది. అయితే నెదర్లాండ్స్‌ను తక్కువగా అంచనా వేస్తే పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే వన్డే ప్రపంచకప్ క్వాలిఫియర్స్‌లో వెస్టిండీస్ వంటి జట్టునే నెదర్లాండ్స్ చిత్తు చేసింది. కాగా ఈ ప్రధాన టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన రెండు వామప్ మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ ఓటమి పాలైంది. మరి ప్రధాన టోర్నీని ఎలా ఆరంభిస్తుందో వేచి చూడాలి. 12 గంటల నుంచి ఎంట్రీ.. ఇక ఈ మ్యాచ్ కోసం 1200 మంది పోలీస్‌లతో భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అభిమానులకు ఎంట్రీ ఇవ్వనున్నారు. మ్యాచ్ జరిగే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పోలీసులు విధించారు. అదే విధంగా అర్ద రాత్రి వరకు మెట్రో రైల్వే సేవలు అందుబాటులో ఉండనున్నాయి. తుది జట్లు(అంచనా) పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, అఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ. నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, వెస్లీ బరేసి, బాస్ డి లీడ్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), కోలిన్ అకెర్మాన్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మీకెరెన్, ర్యాన్ క్లైన్, ఆర్యన్ దత్ చదవండి: World Cup 2023: ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్! -
స్టన్నింగ్ విక్టరీ ; క్రికెట్ వరల్డ్ కప్ ఇండియాదే
షార్జా : ప్రత్యర్థి బౌలర్లను చితగ్గొడుతూ, కొండంత లక్ష్యాన్ని ధీమాగా పిండిచేసిన టీమిండియా.. వరుసగా రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. అంధుల క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా షార్జా వేదికగా శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌పై రెండు వికెట్ల తేడాతో భారత్ సూపర్ విక్టరీ కొట్టింది. పాక్ విసిరిన 307 పరుగుల లక్ష్యాన్ని భారత్.. మరో 10 బంతులు మిగిలి ఉండగానే సాధించడం గమనార్హం. 2014లో తొలిసారి అంధుల ప్రపంచకప్‌ను గెల్చుకున్న భారత్ ఇప్పుడు రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. 1998 నుంచి జరుగుతోన్న ఈ పోటీల్లో భారత్, పాక్‌లు చెరో రెండుసార్లు, సౌతాఫ్రికా ఒకసారి విజేతలుగా నిలిచాయి. ఇరగదీసిన బ్యాట్స్మన్లు : తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాట్స్‌మన్‌కు సహకరించడంతో పాక్ ఆటగాళ్లు చెలరేగిఆడారు. నిర్ణీత 40 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఏ దశలోనూ మ్యాచ్‌పై పట్టుసడలనీయలేదు. ధాటిగా ఆడుతూ మరో 10 బంతులు మిగలి ఉండగానే 309 పరుగులు చేసి విజేతగా నిలిచింది. మొత్తంగా రెండు ఇన్నింగ్సుల్లో కలిపి 600 పైచిలుకు పరుగులు నమోదు కావడం మరో రికార్డు. ప్రపంచకప్ గెల్చుకున్న భారత జట్టుకు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటూ పలువురు అభినందనలు తెలిపారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఫైనల్లో భారత్, పాక్
అజ్మాన్ (యూఏఈ): డిఫెండింగ్ చాంపియన్ భారత క్రికెట్ జట్టు తమ జోరు కొనసాగిస్తూ అంధుల వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బంగ్లాదేశ్ 38.5 ఓవర్లలో 256 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో దుర్గా రావు మూడు వికెట్లు పడగొట్టగా... ప్రకాశ్, దీపక్ రెండేసి వికెట్లు తీశారు. 257 పరుగుల లక్ష్యాన్ని భారత్ 23 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. గణేశ్ (112) సెంచరీ సాధించగా... దీపక్ (53), నరేశ్ (40) రాణించారు. మరో సెమీఫైనల్లో పాకిస్తాన్ 156 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈనెల 20న షార్జాలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ జరుగుతుంది. లీగ్ దశలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. -
9 డాలర్ల పందెం... రెండేళ్ల నిషేధం!
శిక్షకు గురైన ఆసీస్ మహిళా క్రికెటర్ సిడ్నీ: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌పై చాలా మందిలాగే ఆమె కూడా అమితోత్సాహం చూపించింది. అంతటితో ఆగకుండా సరదాగా బెట్టింగ్ చేసింది. ఫైనల్లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు ఎవరికి దక్కుతుందనేదే పందెం. దాని విలువ అక్షరాలా 9 డాలర్లు మాత్రమే (సుమారు రూ. 432). అయితే సదరు మహిళ ఆస్ట్రేలియా క్రికెటర్ కావడం వల్ల ఆ నేరం ‘విలువ’ పెరిగిపోయింది. అంతే...క్రికెట్ ఆస్ట్రేలియా తమ బౌలర్ ఏంజెలా రీక్స్పై రెండేళ్ల నిషేధం విధించింది. ఇటీవలే ఈ బెట్టింగ్ విషయం బయటపడింది. ఆసీస్ బోర్డు నిబంధనల ప్రకారం ‘ఎలైట్’ గ్రూప్‌లో ఉన్న గుర్తింపు గల క్రికెటర్లు ఎవరూ బెట్టింగ్‌కు పాల్పడకూడదు. నిషేధంతో పాటు అవినీతి వ్యతిరేక ప్రచార కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనాల్సి ఉంటుంది. 25 ఏళ్ల రీక్స్ లెగ్‌స్పిన్నర్. దేశవాళీలో ఏసీటీ జట్టు తరఫున ఆడే ఆమె...ప్రస్తుతం మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. కేవలం 9 డాలర్ల బెట్టింగ్ ఒక మహిళా క్రికెటర్ కెరీర్‌ను నాశనం చేయడం విశేషం.