ఫైనల్లో భారత్, పాక్‌ | India Versus Pakistan in the Final of Blind Cricket World Cup | Sakshi
Sakshi News home page

ఫైనల్లో భారత్, పాక్‌

Jan 18 2018 1:47 AM | Updated on Apr 3 2019 4:04 PM

India Versus Pakistan in the Final of Blind Cricket World Cup - Sakshi

అజ్మాన్‌ (యూఏఈ): డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత క్రికెట్‌ జట్టు తమ జోరు కొనసాగిస్తూ అంధుల వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బంగ్లాదేశ్‌ 38.5 ఓవర్లలో 256 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో దుర్గా రావు మూడు వికెట్లు పడగొట్టగా... ప్రకాశ్, దీపక్‌ రెండేసి వికెట్లు తీశారు. 257 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 23 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. గణేశ్‌ (112) సెంచరీ సాధించగా... దీపక్‌ (53), నరేశ్‌ (40) రాణించారు. మరో సెమీఫైనల్లో పాకిస్తాన్‌ 156 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈనెల 20న షార్జాలో భారత్, పాకిస్తాన్‌ జట్ల మధ్య ఫైనల్‌ జరుగుతుంది. లీగ్‌ దశలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement